Tirupati : ఈసారి కూడా ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు టీటీడీ బోర్డు ఛైర్మన్ వై వి. సుబ్బారెడ్డి వెల్లడించారు.

10TV Telugu News

Brahmotsavam 2021 : కరోనా మహమ్మారి ఇంకా వీడడం లేదు. వచ్చే రోజులు మరింత జాగ్రత్తలు అవసరమని నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ పలు దేవాలయాలపై పడింది. దేవాలయంలో జరిగే..పూజలు..ఇతరత్రా విషయాల్లో పలు ఆంక్షలు, నిబంధనలు విధిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా అధికారులు నిబంధనల మధ్య భక్తులను అనుమతినిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో భక్తులు లేకుండానే పూజలు నిర్వహిస్తున్నారు.

Read More : Srisailam : కృష్ణానదికి భారీ వరద.. శ్రీశైలం ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తిన అధికారులు

తాజాగా..శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు టీటీడీ బోర్డు ఛైర్మన్ వై వి. సుబ్బారెడ్డి వెల్లడించారు. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, సర్వదర్శనం టోకెన్ల జారీలో కరోనా ప్రొటోకాల్ పాటిస్తామన్నారు. వీలైనంత త్వరగా…సర్వదర్శనం టోకెన్లకు ఆన్ లైన్ లో జారీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు, కానీ సర్వర్ల సమస్య ఉందని, దీనిని తొందరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

Read More : Srisailam : శ్రీశైలంలో సహస్ర దీపార్చన, వీరభద్రుడికి ప్రత్యేక పూజలు

2021, సెప్టెంబర్ 17వ తేదీ శుక్రవారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ ‘అదివో అల్లదివో’ ప్రోమోను ఛైర్మన్ వైవి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… అదివో అల్లదివో  కార్యక్రమం ద్వారా అన్నమయ్య కీర్తనలకు బహుళ ప్రాచుర్యం కల్పిస్తామని, 15 నుంచి 20 సంవత్సరాల లోపు యువతి యువకులను ఎంపిక చేసి పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

Read More : Tirumala : ఇకపై అందరికీ తిరుమల శ్రీవారి ఉచిత దర్శనం

ఇందులో తొలుత చిత్తూరు జిల్లా వాసులకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. అన్నమయ్య కీర్తనల్లో ఇప్పటికే అనేక కీర్తనలు బహుళ ప్రాచుర్యం పొందాయనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రాచుర్యంలో లేని 4 వేల కీర్తనలు అదివో అల్లదివో కార్యక్రమం ద్వారా ప్రాచుర్యం కల్పిస్తామని తెలిపారు టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి.

10TV Telugu News