Tirupati Vakulamatha Temple : జూన్ 18 నుండి తిరుపతిలోని వకుళమాత ఆలయ మహా సంప్రోక్షణ
తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై నూతనంగా నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమాలు జూన్ 18 నుండి 23వ తేదీ వరకు జరుగనున్నాయి.

Tirupati Vakulamatha Temple : తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై నూతనంగా నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమాలు జూన్ 18 నుండి 23వ తేదీ వరకు జరుగనున్నాయి. జూన్ 23వ తేదీన ఉదయం 7.30 నుండి 8.45 గంటల వరకు విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. జూన్ 18వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు శోభాయాత్ర, రాత్రి 7.30 గంటలకు పుణ్యాహవచనం, ఆచార్య ఋత్విక్ వరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
జూన్ 19న ఉదయం 6.30 నుండి 11 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, అకల్మషహోమం, అక్షిమోచనం, పంచగవ్యాధివాసం చేపడతారు. సాయంత్రం 6.30 గంటలకు అగ్నిప్రతిష్ట, కలశస్థాపన, కుంభావాహనం, కుంభారాధన, ఉక్త హోమాలు నిర్వహిస్తారు. జూన్ 20న ఉదయం 8.30 గంటలకు కుంభారాధన, ఉక్త హోమాలు, నవ కలశ స్నపన క్షీరాధివాసం, సాయంత్రం 6.30 గంటలకు హోమాలు, యాగశాల వైదిక కార్యక్రమాలు చేపడతారు.
జూన్ 21న ఉదయం 8.30 గంటలకు పుణ్యాహవచనం, కుంభారాధన, చతుర్ధశ కలశ స్నపన జలాధివాసం, సాయంత్రం 6.30 గంటల నుండి హోమం, యాగశాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూన్ 22న ఉదయం 8 గంటలకు రత్నధాతు అధివాసం, కుంభారాధన, హోమాలు, ఉదయం 10.45 నుండి 11.30 గంటల వరకు విమాన కలశ స్థాపన, గోపుర కలశ స్థాపన, రత్నన్యాసం, ధాతున్యాసం, విగ్రహ స్థాపన, మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు ఆలయంలో స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.
Telangana :ధ్వజస్తంభం లేని శివాలయం..గంగమ్మ ఒడిలో దాక్కుని 6నెలలే దర్శనమిచ్చే ఉమామహేశ్వరుడు
సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు మహాశాంతి తిరుమంజనం, రాత్రి 8 గంటలకు కుంభారాధనం, నివేదన, శయనాధివాసం, విశేష హోమాలు, యాగశాల కార్యక్రమాలు చేపడతారు. జూన్ 23న ఉదయం 4.30 నుండి 7 గంటల వరకు కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి, విమాన గోపుర కలశ ఆవాహన, ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు మిథున లగ్నంలో ప్రాణ ప్రతిష్ట, మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. ఆ తరువాత అక్షతారోహణం, అర్చక బహుమానం అందిస్తారు.
Appalayagunta : సింహ వాహనంపై ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి అభయం
ఉదయం 10.20 గంటలకు ధ్వజారోహణం, ఉదయం 10.30 నుండి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు శాంతి కల్యాణోత్సవం జరుగనుంది. అనంతరం ధ్వజావరోహణం చేపడతారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 9 గంటల వరకు సర్వదర్శనం కల్పిస్తారు.
- Tirupati : నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
- AP News: అధిక వడ్డీ ఆశచూపి.. రూ.152కోట్లు కుచ్చుటోపీ పెట్టారు..
- Liquor Alipiri : తిరుమలలో మద్యం కలకలం.. 20 మందు బాటిళ్లు స్వాధీనం
- College Admissions : టీటీడీ జూనియర్ కాలేజీల్లో ప్రవేశానికి జూన్ 25 నుండి దరఖాస్తుల ఆహ్వానం
- Job Notification : ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో బోధనా సిబ్బంది పోస్టులకు వాక్-ఇన్-ఇంటర్వ్యూ
1Chiranjeevi : అల్లూరి విగ్రహావిష్కరణకు చిరంజీవి.. రాజమండ్రిలో భారీ స్వాగతం పలికిన మెగా అభిమానులు..
2PM Modi : ఒకే హెలికాప్టర్ లో గన్నవరం నుంచి భీమవరం బయలుదేరిన ప్రధాని మోడీ, సీఎం జగన్, ఏపి గవర్నర్
3Maharashtra: బీజేపీ, ఏక్నాథ్ షిండే మధ్య తాత్కాలిక ఒప్పందం జరిగింది.. అంతే: సంజయ్ రౌత్
4Jasprit Bumrah: ఇంగ్లాండ్ గడ్డపై మరో రికార్డ్ బ్రేక్ చేసిన బుమ్రా
5Kamal Haasan : కమల్ హాసన్ ఆఫీస్‌కి తమిళనాడు ప్రభుత్వం నోటీసులు..
6Himachal Pradesh: ఘోర బస్సు ప్రమాదం.. స్కూల్ విద్యార్థులు సహా 16 మంది మృతి
7covid: భారత్‌లో కొత్తగా 16,135 కరోనా కేసులు
8karimnagar: జమ్మికుంటలో 9వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి
9Dil Raju : కొడుకుని ఎత్తుకొని మురిసిపోతున్న దిల్ రాజు.. వైరల్ గా మారిన ఫొటో..
10PM Modi: ప్రధాని మోదీ భీమవరం టూర్ వివరాలిలా..
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్‌లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు