Arshdeep singh: అదరగొట్టిన అర్షదీప్ సింగ్.. రెండు సార్లు విరిగిన స్టంప్స్.. వాటి విలువ ఎన్ని లక్షలో తెలుసా?

ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఫాస్ట్ బౌలర్ అర్ష‌దీప్ సింగ్ అద్భుత బౌలింగ్ చేశాడు. చివరి ఓవర్లో రెండు సార్లు స్టంప్‌లను విరగ్గొట్టాడు. వాటి విలువ లక్షల్లో ఉండటం గమనార్హం.

Arshdeep singh: అదరగొట్టిన అర్షదీప్ సింగ్.. రెండు సార్లు విరిగిన స్టంప్స్.. వాటి విలువ ఎన్ని లక్షలో తెలుసా?

Arshdeep Singh

Arshdeep singh: పంజాబ్ కింగ్స్ జట్టు పాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ బౌలింగ్ స్పీడ్‌కు వికెట్లు విరిగిపోతున్నాయి. నిప్పులు చెరిగే బంతులతో బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌ బాట పట్టిస్తుండటమే కాకుండా వికెట్లను సైతం అర్షదీప్ సింగ్ విరగ్గొడుతున్నాడు. ఐపీఎల్ 2023లో భాగంగా శనివారం సాయంత్రం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా కొనసాగింది. చివరి థ్రిల్లింగ్ ఓవర్‌లో ముంబై ఇండియన్స్ జట్టుపై అర్షదీప్ అత్యుత్తమ ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ 13 పరుగుల తేడాతో విజయంసాధించింది.

IPL 2023, KKR vs CSK: ఈడెన్‌లో చెన్నై జోరు.. కోల్‌క‌తాపై ఘ‌న విజ‌యం

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు 214 పరుగులు సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టులో కరణ్, సూర్యకుమార్ యాదవ్‌లు ఆఫ్ సెంచరీలు చేసిన లక్ష్యాన్ని చేరుకోలేక పోయారు. పంజాబ్ ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ముంబై ఇండియన్స్ చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సి ఉంది. అర్షదీప్ సింగ్ బౌలింగ్ వేస్తున్నాడు. నిప్పులు చెరుగుతూ వచ్చిన బంతులకు ముంబై బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. అంతేకాదు.. ఎల్‌ఈడీ వికెట్లు‌సైతం విరిగిపోయాయి. ఈ ఓవర్లో తిలక్ వర్మ, నేహాల్ వధేరాలను వరుస బంతుల్లో ఔట్ చేసిన అర్షదీప్.. దీంతో చివరి ఓవర్లో రెండు పరుగులే ఇచ్చి పంజాబ్ విజయంలో కీలక భూమిక పోషించాడు.

IPL 2023, RCB vs RR: ఉత్కంఠ‌పోరులో కోహ్లి సేన‌దే విజ‌యం

చివరి ఓవర్లో తిలక్ వర్మ, నేహాల్ వధేరాలను బౌల్డ్ చేసిన సమయంలో ఎల్‌ఈడీ స్టంప్స్‌కూడా విరిగిపోయాయి. వీటి విలువ రూ. 24లక్షలు ఉంటుంది. జింగ్ బాల్స్, మైక్రోఫోన్ వైరింగ్‌తో కూడిన ఎల్ఈడీల కారణంగా స్టంప్‌ల ధర చాలా ఎక్కువఅని బీసీసీఐ అధికారులు తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అర్షదీప్ చివరి ఓవర్‌లో స్టంప్‌లు విరగ్గొట్టిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వావ్.. అర్షదీప్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

 

 

ఐపీఎల్ 2023 లో పంజాబ్ కింగ్స్ జట్టు ఏడు మ్యాచ్ లు ఆడింది. అందులో నాలుగు మ్యాచ్ లు విజయం సాధించి ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరవ స్థానంలో ఉంది.