German village: నీరజ్ చోప్రా విజయం.. జర్మన్ గ్రామంలో సెలబ్రేషన్స్

భారతదేశానికి మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ ఒలింపిక్ స్వర్ణం అందించిన స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా విజయం మన దేశంలోనే కాదు.. జర్మనీలోని కొన్ని గ్రామాలు కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి.

German village: నీరజ్ చోప్రా విజయం.. జర్మన్ గ్రామంలో సెలబ్రేషన్స్

Neerag

German village: భారతదేశానికి మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ ఒలింపిక్ స్వర్ణం అందించిన స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా విజయం మన దేశంలోనే కాదు.. జర్మనీలోని కొన్ని గ్రామాలు కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. వాస్తవానికి హరియాణాలోని పానీపత్‌ జిల్లా ఖంద్రా గ్రామానికి చెందిన నీరజ్‌ చోప్రా(23) వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. వ్వవసాయమే వారి జీవన ఆధారం. బాల్యంలో బద్ధకంతో విపరీతంగా బరువు పెరిగి, 12 ఏళ్లకే 90కిలోల బరువుతో ఇబ్బందులు పడి, చివరకు అధిక బరువును అధిగమించి దేశం గర్వించేలా చేశాడు నీరజ్ చోప్రా.

అటువంటి నిరజ్ జీవితంలో జర్మన్ గ్రామానికి కూడా కొంత ప్రాముఖ్యత ఉంది. ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా నీరజ్‌ చోప్రా కఠోర శిక్షణ తీసుకోగా.. అతను జర్మన్ బయో మెకానిక్స్ నిపుణుడు క్లాస్ బార్టోనియెట్జ్ వద్దే ట్రైనింగ్ తీసుకున్నాడు. ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలిసారే స్వర్ణం గెలిచి, సత్తాచాటిన నీరజ్.. తన కలను నెరవేర్చుకున్నాడు. ట్రైనర్ బార్టోనియెట్జ్ గ్రామమైన ఒబెర్ష్‌లెటెన్‌బాచ్‌లో ఇప్పుడు సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ సెలబ్రేషన్స్ ఒలింపిక్స్‌లో బంగారుపతకం అందించేలా ట్రైనింగ్ ఇచ్చిన బార్టోనియెట్జ్‌ను అక్కడ సత్కరిస్తున్నారు.

జర్మనీకి చెందిన డాక్టర్‌ క్లాస్‌ బార్టోనియెట్జ్‌ మాత్రమే కాదు.. ఆస్ట్రేలియాకు చెందిన ఉవె హాన్‌ ఇద్దరూ నీరజ్‌ చోప్రాకు కోచ్‌లుగా వ్యవహరించారు. 2018 కామన్‌వెల్త్‌, ఆసియా క్రీడల్లో నీరజ్‌ స్వర్ణ పతకాలు గెలిచిన తర్వాత ఉవె హాన్‌ కోచ్‌గా మారారు. జావెలిన్‌ త్రోలో 100 మీటర్లకు మించి జావెలిన్‌ను విసిరిన ఏకైక అథ్లెట్‌ హాన్‌ మాత్రమే. ఇప్పటికీ ఆ రికార్డు ఎవరూ బద్ధలు కొట్టలేదు. అటువంటి వ్యక్తి శిక్షణలో నీరజ్‌ రాటుతేలాడు.

2019లో నీరజ్‌ చోప్రాకు మోచేయి ఆపరేషన్ జరిగింది. తర్వాత అతనికి వ్యక్తిగత కోచ్‌గా డాక్టర్‌ క్లాస్‌ బార్టోనియెట్జ్‌ నియమితులయ్యారు. డాక్టర్‌ క్లాస్‌కు జావెలిన్‌ త్రోలో ఉండే సమస్యలు తెలుసు.. పరిష్కారం తెలుసు. నీరజ్ వెన్నంటే ఉండి ఆ సమస్యలకు చెక్ చెప్పాడు డాక్టర్‌ క్లాస్‌.