IND vs AUS: డేవిడ్ వార్నర్ ను వెనక్కి పిలిపించనున్న ఆస్ట్రేలియా?

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌ లో ఆసీస్ అవమానకర రీతిలో ఓడిపోయిన నేపథ్యంలో ఆ దేశ ఆటగాడు డేవిడ్ వార్నర్ ను వెనక్కి పిలిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆస్ట్రేలియా మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. అతడి స్థానంలో ఆల్ రౌండర్ ట్రావిస్ మైఖేల్ హెడ్ ను న్యూఢిల్లీలో జరిగే రెండో టెస్టు మ్యాచులో తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా మీడియాలో కథనాలు వచ్చాయి.

IND vs AUS: డేవిడ్ వార్నర్ ను వెనక్కి పిలిపించనున్న ఆస్ట్రేలియా?

IND vs AUS

IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌ లో ఆసీస్ అవమానకర రీతిలో ఓడిపోయిన నేపథ్యంలో ఆ దేశ ఆటగాడు డేవిడ్ వార్నర్ ను వెనక్కి పిలిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆస్ట్రేలియా మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. అతడి స్థానంలో ఆల్ రౌండర్ ట్రావిస్ మైఖేల్ హెడ్ ను న్యూఢిల్లీలో జరిగే రెండో టెస్టు మ్యాచులో తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రేలియా మీడియాలో కథనాలు వచ్చాయి.

వార్నర్ రెండు ఇన్నింగ్సుల్లోనూ విఫలం కావడంతో అతడిని తప్పించాలని ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ అధికారులు చర్చలు జరుపుతున్నారని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తెలిపింది. తొలి టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా 177 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్సులో భారత్ 400 పరుగులు బాదింది. రెండో ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా 91 పరుగులకే కుప్పకూలింది.

దీంతో టీమిండియా ఇన్నింగ్సు, 132 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలి మ్యాచు తొలి ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 1 పరుగులకే ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్సులో 10 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా జట్టు అన్ని విభాగాల్లోనూ విఫలం అయింది.

UK Drug Lord: బ్రిటన్ మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డీలర్.. థాయ్‌లాండ్‌లో అరెస్ట్