UK Drug Lord: బ్రిటన్ మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డీలర్.. థాయ్‌లాండ్‌లో అరెస్ట్

ఇంగ్లండ్‌లోని ఎస్సెక్స్ కౌంటీకి చెందిన రిచర్డ్.. డ్రగ్స్ వ్యాపారాన్ని నిర్వహించేవాడు. ఈ క్రమంలో 2016లో సుమారు రూ.8 కోట్ల విలువైన లిక్విడ్ అంఫెటమైన్ అనే డ్రగ్‌ను దేశంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడిపై కేసు నమోదైంది.

UK Drug Lord: బ్రిటన్ మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డీలర్.. థాయ్‌లాండ్‌లో అరెస్ట్

UK Drug Lord: ఐదేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న రిచర్డ్ వేక్‌లింగ్ అనే బ్రిటన్ మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డీలర్‌ థాయ్‌లాండ్‌లో పట్టుబడ్డాడు. అతడి వయసు 55 ఏళ్లు. బ్యాంకాక్ పట్టణంలో శుక్రవారం రిచర్డ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అక్కడి పోలీసులు తెలిపారు.

Asian Indoor Championships: ఆసియన్ ఇండోర్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు పతకాలు.. మహిళా పోల్ వాల్ట్‌లో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్

బ్రిటిష్ నేషనల్ క్రైమ్ ఏజెన్సీ (ఎన్‌సీఏ)తో కలిసి బ్యాంకాక్‌కు చెందిన సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు అతడ్ని అరెస్టు చేశారు. ఇంగ్లండ్‌లోని ఎస్సెక్స్ కౌంటీకి చెందిన రిచర్డ్.. డ్రగ్స్ వ్యాపారాన్ని నిర్వహించేవాడు. ఈ క్రమంలో 2016లో సుమారు రూ.8 కోట్ల విలువైన లిక్విడ్ అంఫెటమైన్ అనే డ్రగ్‌ను దేశంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడిపై కేసు నమోదైంది. అతడికి కోర్టు 11 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. అయితే, అతడు 2018లో బ్రిటన్ నుంచి తప్పించుకుని పారిపోయాడు. అప్పటి నుంచి అతడి కోసం ఎన్‌సీఏ అధికారులు వెతుకుతూనే ఉన్నారు.

Turkey Earthquake: టర్కీలో భూకంపం.. ఆస్పత్రిలో శిశువుల్ని కాపాడేందుకు నర్సులు ఏం చేశారంటే?

అతడి పేరును పోలీసులు మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చారు. రిచర్డ్ 1993 నుంచి తరచూ థాయ్‌లాండ్ వెళ్తుండేవాడు. అతడికి అక్కడ మంచి పరిచయాలున్నాయి. అందుకే బ్రిటన్‌లో అతడిపై నమోదైన కేసుల నేపథ్యంలో థాయ్‌లాండ్ పారిపోయాడు. తన పేరు, దేశం వంటి వివరాలు మార్చుకున్నాడు. ఐర్లాండ్‌కు చెందిన వ్యక్తిగా చెప్పుకొని పాస్‌పోర్టు కూడా తీసుకున్నాడు తర్వాత థాయ్‌లాండ్‌లోనే ఉండటం మొదలుపెట్టాడు. దీంతో అతడ్ని పట్టుకోవడం అధికారులకు సాధ్యం కాలేదు.

అయితే, తాజాగా అతడు అనుమానాస్పదంగా అనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. చివరకు తానే రిచర్డ్ అని ఒప్పుకొన్నాడు. సోమవారం అతడిని స్థానిక కోర్టులో హాజరు పరుస్తారు. బ్రిటన్ తీసుకెళ్లేందుకు కోర్టును అనుమతి కోరుతారు.