Ind Vs NZ 2nd ODI : ఎదురులేని భారత్.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కైవసం

భారత్ జోరు మీదుంది. సొంత గడ్డపై టీమిండియా జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. భారత జట్టు మరో సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది. న్యూజిలాండ్ తో రెండో వన్డేలోనూ ఘన విజయం సాధించిన భారత్.. వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది.

Ind Vs NZ 2nd ODI : ఎదురులేని భారత్.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కైవసం

Ind Vs NZ 2nd ODI : భారత్ జోరు మీదుంది. సొంత గడ్డపై టీమిండియా జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. భారత జట్టు మరో సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది. న్యూజిలాండ్ తో రెండో వన్డేలోనూ ఘన విజయం సాధించిన భారత్.. వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది.

రాయ్ పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. తొలుత న్యూజిలాండ్ ను 108 పరుగులకు కుప్పకూల్చిన భారత్… అనంతరం 20.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 20.1 ఓవర్లలో భారత్ రెండు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది.

Also Read..Sexual Harassments IN Indian Sports: భారత క్రీడారంగంలో వేళ్లూనుకుపోయిన లైంగిక వేధింపులు? అయినా చర్యలు తీసుకోని దుస్థితి..క్రీడా స్ఫూర్తికి గొడ్డలిపెట్టుగా మారిన పరిస్థితి

కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 50 బంతుల్లో 51 పరుగులు చేశాడు. తొలి వన్డే డబుల్ సెంచరీ హీరో శుభ్ మన్ గిల్ 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. విరాట్ కోహ్లీ 11 పరుగులు చేసి ఔటయ్యాడు. కివీస్ బౌలర్లలో షిప్లే, శాంట్నర్ తలో వికెట్ తీశారు.

ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా 2-0తో కైవసం చేసుకుంది. ఇక, ఇరుజట్ల మధ్య ఈ నెల 24న మూడో వన్డే జరగనుంది. ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం ఈ నామమాత్రపు మ్యాచ్ కు వేదిక కానుంది.

Also Read..Sexual Harassments In Indian Sports: భారత క్రీడారంగాన్ని కుదిపేస్తున్న లైంగిక ఆరోపణలు.. వేధింపుల వల్లే టాలెంటెడ్ ప్లేయర్లు రాణించలేకపోతున్నారా?

తొలుత టాస్ నెగ్గిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ నమ్మకాన్ని భారత బౌలర్లు వమ్ము చేయలేదు. బౌలింగ్ కు సహకరించిన రాయ్ పూర్ పిచ్ పై టీమిండియా బౌలర్లు నిప్పులు చెరిగారు. న్యూజిలాండ్ ను 108 పరుగులకే ఆలౌట్ చేశారు. కెప్టెన్ నిర్ణయం సరైనదేనని నిరూపించారు. టీమిండియా బౌలర్లలో మహమ్మద్ షమీ 3 వికెట్లతో సత్తా చాటాడు. హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. సిరాజ్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.

కివీస్ ఓ దశలో 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే తొలి వన్డే సెంచరీ హీరో మైకేల్ బ్రేస్వెల్ (22), గ్లెన్ ఫిలిప్స్ (36), మిచెల్ శాంట్నర్ (27) ఆదుకోవడంతో న్యూజిలాండ్ స్కోరు కనీసం 100 అయినా దాటింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఫిన్ అలెన్ డకౌట్ కాగా, మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 7, హెన్రీ నికోల్స్ 2, డారిల్ మిచెల్ 1, కెప్టెన్ టామ్ లాథమ్ 1, లాకీ ఫెర్గుసన్ 1, బ్లెయిర్ టిక్నర్ 2 పరుగులు చేశారు. హెన్రీ షిప్లే 2 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు.