IND Vs NZ 3rd T20I : రాణించిన భారత్.. న్యూజిలాండ్ ముందు భారీ లక్ష్యం

న్యూజిలాండ్ తో మూడో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోర్ చేసింది. కివీస్ ముందు 185 పరుగుల టార్గెట్ ఉంచింది.

IND Vs NZ 3rd T20I : రాణించిన భారత్.. న్యూజిలాండ్ ముందు భారీ లక్ష్యం

Ind Vs Nz 3rd T20i

IND Vs NZ 3rd T20I : న్యూజిలాండ్ తో చివరి, మూడో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోర్ చేసింది. కివీస్ ముందు 185 పరుగుల టార్గెట్ ఉంచింది.

కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో రాణించాడు. 31 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 29, శ్రేయస్ అయ్యర్ 25, వెంకటేశ్ అయ్యర్ 20, దీపక్ చాహర్ 21, హర్షల్ పటేల్ 18 పరుగులు చేశారు. చివర్లో దీపక్ చాహర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 8 బంతుల్లోనే 21 పరుగులు చేశాడు.

Invest Grow Your Wealth: ఈ సీక్రెట్ తెలిస్తే.. రూ.10లక్షల పెట్టుబడితో రూ.100 కోట్లు ఈజీగా సంపాదించొచ్చు..!

రోహిత్ శర్మ, ఇషాన్ కిషాన్ శుభారంభం ఇచ్చారు. ధాటిగా ఆడుతూ పరుగులు రాబట్టారు. వారిద్దరు ఔట్ కావడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. మిగతా బ్యాటర్లు పెద్దగా స్కోర్ చేయలేకపోయారు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 3 వికెట్లు తీశాడు. ఇష్ సోథీ, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నే, ఫెర్గుసన్ తలో వికెట్ తీశారు.

Sonu Sood : వైసీపీ నేతల వైఖరి సరికాదన్న సోనూసూద్.. చంద్రబాబుకి ఫోన్‌లో పరామర్శ

3 టీ20ల సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు విజయాలు సాధించిన భారత్ సిరీస్ కైవస్ చేసుకుంది. ఆఖరి మ్యాచ్ లోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. కేఎల్ రాహుల్ బదులు ఇషాన్ కిషన్, అశ్విన్ స్థానంలో యజువేంద్ర చాహల్
టీమ్ లోకి వచ్చారు.