INDvsBAN: బంగ్లాపై మరింత బలంగా భారత్

INDvsBAN: బంగ్లాపై మరింత బలంగా భారత్

బంగ్లాదేశ్‌ను టీ20 సిరీస్ లో మట్టి కరిపించిన భారత్.. రెండో సిరీస్ లోనూ ఆధిక్యత కొనసాగించాలని వ్యూహరచన చేస్తోంది. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్‌లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ను ఆడనుంది. గురువారం ఇండోర్ వేదికగా జరగనున్న మ్యాచ్ లో విజయం సాధించాలనే లక్ష్యంగా ఇరు జట్లు కనిపిస్తున్నప్పటికీ భారత్ మరింత బలంగా బరిలోకి దిగడం ఖాయం. 

యువ క్రికెటర్లకు అవకాశం కల్పించే దిశగా టీ20 ఫార్మాట్ లో మార్పులు చేసిన భారత్.. కోహ్లీతో సహా సీనియర్లను టెస్టు మ్యాచ్ లకు సిద్ధం చేస్తుంది. మ్యాచ్ కు ముందు జరిగిన మీడియా సమావేశంలోనూ కోహ్లీ ముగ్గురు ఫేసర్లతో దిగుతామని చెప్పాడు. 

మరోవైపు షకీబ్ అల్ హసన్, మోమినుల్ హక్ లాంటి క్రికెటర్లు దూరమవడంతో పర్యాటక జట్టుపై ఆధిక్యత చూపేందుకు మార్గం సుగమమైంది. కొద్ది రోజుల ముందే స్పాట్ ఫిక్సింగ్ విషయం బయటపడటంతో షకీబ్ రెండేళ్ల నిషేదం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 

బంగ్లాదేశ్ మంచి జట్టు. దక్షిణాఫ్రికాపై బాగా ఆడాం. కానీ, అదంతా గతం. ప్రస్తుతం ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ జరుగుతోంది. ఇందులో ప్రతి మ్యాచ్ కీలకం. ఇండోర్ వేదికగా జరగనున్న ఈ గేమ్ లో విజయం సాధిస్తామనే నమ్మకముంది. బంగ్లాదేశ్ జట్టును పూర్తిగా గౌరవిస్తున్నాం. ఇతరుల బలంపై కాకుండా మా బలాన్ని నమ్ముకుని బరిలోకి దిగుతున్నాం’ అని వైస్ కెప్టెన్ అజింకా రహానె అన్నాడు. 

వేదిక, సమయం: 
ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం వేదికగా, ఉదయం 9గంటల 30నిమిషాల నుంచి

పిచ్ రిపోర్టు:
పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలించేట్లుగా కనిపిస్తోంది. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దింపితే కలిసొస్తుంది. మూడో రోజు నుంచి స్పిన్నర్లకు కలిసి రానుంది. టాస్ ను బట్టి ఫలితం తెలుస్తుంది. వర్షం పడే సూచనలు లేకపోవడంతో ఏ వాతావరణపరంగా ఏ ఇబ్బంది లేదు. 

ఇండియా:
రోహిత్, మయాంక్, పూజారా, విరాట్ (కెప్టెన్), రహానె, జడేజా, సాహా (wk), అశ్విన్, ఇశాంత్ / కుల్దీప్, షమీ, ఉమేష్.

బంగ్లాదేశ్:
ఇమ్రుల్, సద్మాన్, మోమినుల్ (కి), రహీమ్, మహముదుల్లా, లిటాన్ (సరే), నయీమ్, మెహదీ, తైజుల్, మోస్టాఫిజుర్, అల్ అమీన్.