India Vs South Africa : ధీటుగా బదులిస్తున్న భారత్.. శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ | India Vs South Africa Live Update Shikhar Dhawan Half Century

India Vs South Africa : ధీటుగా బదులిస్తున్న భారత్.. శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ

కెప్టెన్ గా ఉన్న రాహుల్..ఓపెనర్ గా వచ్చాడు. కేవలం 12 పరుగులు చేసి మార్ క్రమ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఓపెనర్ గా వచ్చిన శిఖర్ ధావన్ బ్యాట్ కు పని చెబుతున్నాడు...

India Vs South Africa : ధీటుగా బదులిస్తున్న భారత్.. శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ

Shikhar Dhawan Half Century : సౌతాఫ్రికా విధించిన టార్గెట్ ను చేధించడానికి టీమిండియా ప్రయత్నిస్తోంది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా జట్టు 296 పరుగులు చేసింది. అనంతరం 297 పరుగుల లక్ష్య చేధనకు భారత బ్యాట్స్ మెన్స్ రంగంలోకి దిగారు. చక్కటి అవకాశం లభించిన రాహుల్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కెప్టెన్ గా ఉన్న రాహుల్..ఓపెనర్ గా వచ్చాడు. కేవలం 12 పరుగులు చేసి మార్ క్రమ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఓపెనర్ గా వచ్చిన శిఖర్ ధావన్ బ్యాట్ కు పని చెబుతున్నాడు. ఒక్క బంతిని కూడా వేస్ట్ చేయనీయకుండా పరుగులు రాబట్టేందుకు కృషి చేస్తున్నాడు.

Read More : Warangal Chit Funds : 10టీవీ ఎఫెక్ట్ : వరంగల్‌లో చిట్‌ఫండ్ వ్యాపారులపై పోలీసుల దాడులు

53 బంతులను ఎదుర్కొన్న ధావన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం 54 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇతనికి మాజీ కెప్టెన్ కోహ్లీ సహకారం అందిస్తున్నాడు. కోహ్లీ 13 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. మొత్తంగా జట్టు స్కోరు 14.6 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయిన టీమిండియా 80 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా, వాండర్ డస్సెన్ లు బ్యాట్ తో చెలరేగిపోయాడు. వీరిద్దరూ సెంచరీలు సాధించడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది.

Read More :A CS Sameer Sharma : పీఆర్సీతో జీతాలు తగ్గవు, సౌతిండియాలోనే ఏపీలో హెచ్ఆర్ఏ ఎక్కువ

టీమిండియా జట్టు : కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, శార్దూర్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్

దక్షిణాఫ్రికా జట్టు : క్వింటన్ డి కాక్, జానెమన్ మలన్, తెంబా బవుమా, మార్ క్రమ్, రస్సీ వాండర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, పెహ్లుక్వాయో, మార్కో జాన్సన్, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, తబ్రెయిజ్ షంసి.

×