IPL 2023, KKR vs RR: జైస్వాల్ విధ్వంసం.. కోల్‌క‌తాపై రాజ‌స్థాన్ ఘ‌న విజ‌యం

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023 సీజ‌న్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్(Kolkata Knight Riders) తో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌(Rajasthan Royals) ఘ‌న విజ‌యం సాధించింది.

IPL 2023, KKR vs RR: జైస్వాల్ విధ్వంసం.. కోల్‌క‌తాపై రాజ‌స్థాన్ ఘ‌న విజ‌యం

KKR vs RR

IPL 2023, KKR vs RR: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023 సీజ‌న్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్(Kolkata Knight Riders) తో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌(Rajasthan Royals) ఘ‌న విజ‌యం సాధించింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 11 May 2023 10:40 PM (IST)

    రాజ‌స్థాన్ విజ‌యం

    ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023 సీజ‌న్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్(Kolkata Knight Riders) తో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌(Rajasthan Royals) ఘ‌న విజ‌యం సాధించింది. కోల్‌క‌తా నిర్ధేశించిన 150 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 13.1 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోయి ఛేదించింది.

  • 11 May 2023 10:36 PM (IST)

    జైస్వాల్ ఫోర్‌

    13వ ఓవ‌ర్‌ను సుయాష్ శర్మ వేశగా 7 ప‌రుగులు వ‌చ్చాయి. మూడో బంతికి జైస్వాల్‌ ఫోర్ కొట్టాడు. 13 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 147/1. యశస్వి జైస్వాల్(94), సంజుశాంస‌న్‌(48) లు క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 10:31 PM (IST)

    ఫోర్‌, సిక్స్‌

    12వ‌ ఓవ‌ర్‌ను వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి వేయ‌గా 13 ప‌రుగులు వ‌చ్చాయి. మొద‌టి బంతికి జైస్వాల్ ఫోర్ కొట్ట‌గా మూడో బంతికి శాంస‌న్ సిక్స్ బాదాడు. 12 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 140/1. యశస్వి జైస్వాల్(89), సంజుశాంస‌న్‌(47) లు క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 10:27 PM (IST)

    శాంస‌న్ మూడు సిక్స‌ర్లు

    11వ ఓవ‌ర్‌ను అనుకుల్ రాయ్ వేయ‌గా 20 ప‌రుగులు వ‌చ్చాయి. సంజు శాంస‌న్ మూడు సిక్స‌ర్లు బాదాడు. 11 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 127/1. యశస్వి జైస్వాల్(83), సంజుశాంస‌న్‌(40) లు క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 10:23 PM (IST)

    శాంస‌న్ ఫోర్

    ప‌దో ఓవ‌ర్‌ను సుయాష్ శర్మ వేయ‌గా 6 ప‌రుగులు వ‌చ్చాయి. నాలుగో బంతికి శాంస‌న్ ఫోర్ కొట్టాడు. 10 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 107/1. యశస్వి జైస్వాల్(82), సంజుశాంస‌న్‌(21) లు క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 10:19 PM (IST)

    3 ప‌రుగులు

    తొమ్మిదో ఓవ‌ర్‌ను సునీల్ న‌రైన్ క‌ట్టుదిట్టంగా వేయ‌డంతో 3 ప‌రుగులు వ‌చ్చాయి. 9 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 101/1. యశస్వి జైస్వాల్(81), సంజుశాంస‌న్‌(16) లు క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 10:16 PM (IST)

    10 ప‌రుగులు

    ఎనిమిదో ఓవ‌ర్‌ను సుయాష్ శర్మ వేయ‌గా 10 ప‌రుగులు వ‌చ్చాయి. రెండో బంతికి జైస్వాల్ సిక్స్ కొట్టాడు. 8 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 98/1. యశస్వి జైస్వాల్(78), సంజుశాంస‌న్‌(16) లు క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 10:11 PM (IST)

    జైస్వాల్ సిక్స్

    ఏడో ఓవ‌ర్‌ను సునీల్ న‌రైన్ వేయ‌గా 10 ప‌రుగులు వ‌చ్చాయి. మూడో బంతికి జైస్వాల్ సిక్స్ కొట్టాడు. 7 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 88/1. యశస్వి జైస్వాల్(70), సంజుశాంస‌న్‌(14) లు క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 10:05 PM (IST)

    సంజు శాంస‌న్ సిక్స్‌, ఫోర్‌

    రాజ‌స్థాన్ ఇన్నింగ్స్‌లో ప‌వ‌ర్ ప్లే ముగిసింది. ఆరో ఓవ‌ర్‌ను వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి వేయ‌గా 10 ప‌రుగులు వ‌చ్చాయి. నాలుగో బంతికి సిక్స్ కొట్టిన సంజు శాంస‌న్ ఆఖ‌రి బంతికి ఫోర్ బాదాడు. 6 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 78/1. యశస్వి జైస్వాల్(62), సంజుశాంస‌న్‌(12) లు క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 10:01 PM (IST)

    జైస్వాల్ రెండు ఫోర్లు

    ఐదో ఓవ‌ర్‌ను హర్షిత్ రాణా వేయ‌గా 9 ప‌రుగులు వ‌చ్చాయి. నాలుగు, ఐదో బంతుల‌ను జైస్వాల్ బౌండ‌రీల‌కు త‌ర‌లించాడు. 5 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 68/1. యశస్వి జైస్వాల్(62), సంజుశాంస‌న్‌(2) లు క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 09:56 PM (IST)

    జైస్వాల్ ఫోర్‌

    నాలుగో ఓవ‌ర్‌ను వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి క‌ట్టుదిట్టంగా వేయ‌డంతో 5 ప‌రుగులు వ‌చ్చాయి. ఐదో బంతికి జైస్వాల్ ఫోర్ కొట్టాడు. 4 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 59/1. యశస్వి జైస్వాల్(54), సంజుశాంస‌న్‌(1) లు క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 09:52 PM (IST)

    ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ..

    యువ ఆట‌గాడు య‌శ‌స్వి జైస్వాల్ త‌న సూప‌ర్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో(2.5వ ఓవ‌ర్‌) సింగిల్ తీసి 13 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ క్ర‌మంలో ఐపీఎల్‌లో చ‌రిత్ర‌లో అత్య‌ధిక వేగ‌వంత‌మైన హాప్ సెంచ‌రీ చేసిన ఆట‌గాడిగా నిలిచాడు. ఈ ఓవ‌ర్‌లో జైస్వాల్ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడంతో 14 ప‌రుగులు వ‌చ్చాయి. 3 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 54/1. యశస్వి జైస్వాల్(50), సంజుశాంస‌న్‌(1) లు క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 09:44 PM (IST)

    బ‌ట్ల‌ర్ ర‌నౌట్‌

    రాజ‌స్థాన్‌కు భారీ షాక్ త‌గిలింది. బ‌ట్ల‌ర్(0) ర‌నౌట్ అయ్యాడు. హర్షిత్ రాణా బౌలింగ్‌లో బ‌ట్ల‌ర్ ఆడ‌గా బంతి బ్యాట్‌కు త‌గ‌ల‌లేదు. ప్యాడ్‌కు తాక‌డంతో ప‌క్క‌కు వెళ్లింది. బ‌ట్ల‌ర్ సింగిల్ వ‌ద్ద‌ని చెప్ప‌లోపే జైస్వాల్ స్ట్రైకింగ్ ఎండ్‌కు దాదాపు వ‌చ్చేయ‌డంతో బ‌ట్ల‌ర్ అత‌డి కోసం త‌న వికెట్‌ను త్యాగం చేశాడు. దీంతో రాజ‌స్థాన్ 30 ప‌రుగుల(1.4వ ఓవ‌ర్‌) వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. మిగిలిన రెండు బంతుల‌ను జైస్వాల్ ఫోర్‌, సిక్స్‌గా మ‌లిచాడు. 2 ఓవ‌ర్ల‌కు రాజ‌స్థాన్ స్కోరు 40/1. యశస్వి జైస్వాల్(37), సంజుశాంస‌న్‌(0) లు క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 09:36 PM (IST)

    26 ప‌రుగులు

    ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు రాజ‌స్థాన్ బ‌రిలోకి దిగింది. యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ లు ఓపెన‌ర్లుగా వ‌చ్చారు. తొలి ఓవ‌ర్‌ను కెప్టెన్ నితీశ్ రాణా వేయ‌గా జైస్వాల్ దంచికొట్టాడు. మొద‌టి రెండు బంతుల‌ను సిక్స్‌లుగా మ‌లిచిన జైస్వాల్, మూడు, నాలుగు, ఆరో బంతుల‌ను బౌండ‌రీల‌కు త‌ర‌లించాడు. 1 ఓవ‌ర్ రాజ‌స్థాన్ స్కోరు 26/0. యశస్వి జైస్వాల్(26), జోస్ బట్లర్(0) లు క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 09:17 PM (IST)

    రాజ‌స్థాన్ ల‌క్ష్యం 150

    టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌క‌తా ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 149 ప‌రుగులు చేసింది. కోల్‌క‌తా బ్యాట‌ర్ల‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్‌(57; 42 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కంతో రాణించాడు. మిగిలిన వారిలో కెప్టెన్ నితీశ్ రాణా(22), రింకూసింగ్‌(16), రహ్మానుల్లా గుర్బాజ్(18) లు ప‌ర్వాలేనిపించ‌గా జేస‌న్ రాయ్‌(10), ర‌స్సెల్ (10) లు విఫ‌లం అయ్యారు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో చాహ‌ల్ నాలుగు వికెట్లు తీయ‌గా, ట్రెంట్ బౌల్ట్ రెండు, కేఎం ఆసిఫ్, సందీప్ శ‌ర్మ ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

  • 11 May 2023 09:09 PM (IST)

    రింకూ సింగ్ ఔట్‌

    19వ ఓవ‌ర్‌ను చాహ‌ల్ వేయ‌గా నాలుగో బంతికి భారీ షాట్‌కు య‌త్నించిన రింకూ సింగ్(16) బౌండ‌రీ లైన్ వ‌ద్ద రూట్ చేతికి చిక్కాడు. దీంతో 140 ప‌రుగుల వ‌ద్ద కోల్‌క‌తా 7 వికెట్ కోల్పోయింది. 19 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 142/7. సునీల్ న‌రైన్‌(4), అనుకుల్ రాయ్(1) లు క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 09:04 PM (IST)

    రింకూ సింగ్ సిక్స్‌

    18వ ఓవ‌ర్‌ను సందీప్ శ‌ర్మ వేయ‌గా 8 ప‌రుగులు వ‌చ్చాయి. ఐదో బంతికి రింకూ సింగ్స్ సిక్స్ కొట్టాడు. 18 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 139/6. రింకూ సింగ్(16), అనుకుల్ రాయ్(2) లు క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 09:00 PM (IST)

    శార్దూల్ ఠాకూర్ ఔట్‌

    కోల్‌క‌తా ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. చాహ‌ల్ బౌలింగ్‌లో మొద‌టి బంతికి వెంక‌టేశ్ అయ్య‌ర్ ఔట్ కాగా నాలుగో బంతికి శార్దూల్ ఠాకూర్ ఎల్భీగా పెవిలియ‌న్ చేరుకున్నాడు. దీంతో 129 ప‌రుగుల వద్ద కోల్‌క‌తా ఆరో వికెట్ కోల్పోయింది. 17 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 131/6. రింకూ సింగ్(8), అనుకుల్ రాయ్(2) లు క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 08:54 PM (IST)

    వెంక‌టేశ్ అయ్య‌ర్ ఔట్‌

    కోల్‌క‌తా మ‌రో వికెట్ కోల్పోయింది. చాహ‌ల్ బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్ క్యాచ్ అందుకోవ‌డంతో వెంక‌టేశ్ అయ్య‌ర్(57) ఔట్ అయ్యాడు. దీంతో 127 ప‌రుగుల(16.1వ ఓవ‌ర్‌) వ‌ద్ద కోల్‌క‌తా ఐదో వికెట్ కోల్పోయింది.

  • 11 May 2023 08:48 PM (IST)

    వెంక‌టేశ్ అయ్య‌ర్ అర్ధ‌శ‌త‌కం

    కేఎం ఆసిఫ్ బౌలింగ్‌లో(15.1వ ఓవ‌ర్‌) సింగిల్ తీసి 39 బంతుల్లో 2 పోర్లు, 3 సిక్స్‌ల‌తో వెంక‌టేశ్ అయ్య‌ర్ అర్ధ‌శ‌త‌కం పూర్తి చేసుకున్నాడు. మూడో బంతికి అయ్య‌ర్ సిక్స్ కొట్ట‌డంతో మొత్తంగా ఈ ఓవ‌ర్‌లో 11 ప‌రుగులు వ‌చ్చాయి. 16 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 127/4. రింకూ సింగ్(7), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(57) లు క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 08:46 PM (IST)

    6 ప‌రుగులు

    15వ ఓవ‌ర్‌ను ర‌విచంద్ర‌న్ అశ్విన్ వేయ‌గా 6 ప‌రుగులు వ‌చ్చాయి. 15 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 116/4. రింకూ సింగ్(4), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(49) లు క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 08:39 PM (IST)

    ర‌స్సెల్ ఔట్‌

    14వ ఓవ‌ర్‌ను కేఎం ఆసిఫ్ వేశాడు. రెండో బంతికి సిక్స్ కొట్టిన ర‌స్సెల్‌(10) ఆ మ‌రుస‌టి బంతికి అశ్విన్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. 107 ప‌రుగుల వ‌ద్ద కోల్‌క‌తా నాలుగో వికెట్ కోల్పోయింది. 14 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 110/4. రింకూ సింగ్(2), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(45) లు క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 08:34 PM (IST)

    వెంక‌టేశ్ అయ్య‌ర్ దూకుడు

    వెంక‌టేశ్ అయ్య‌ర్ దూకుడు పెంచాడు. 13వ‌ ఓవ‌ర్‌ను చాహ‌ల్ వేయ‌గా ఓ సిక్స్‌, రెండు ఫోర్లు కొట్టాడు. దీంతో ఈ ఓవ‌ర్‌లో 15 ప‌రుగులు వ‌చ్చాయి. 13 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 100/3. ఆండ్రీ ర‌స్సెల్‌(4), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(43) లు క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 08:30 PM (IST)

    6 ప‌రుగులు

    12వ ఓవ‌ర్‌ను కేఎం ఆసిఫ్ క‌ట్టుదిట్టంగా వేయ‌డంతో 6 ప‌రుగులు వ‌చ్చాయి. 12 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 85/3. ఆండ్రీ ర‌స్సెల్‌(4), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(28) లు క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 08:21 PM (IST)

    నితీశ్‌ రాణా ఔట్‌

    కోల్‌క‌తా మ‌రో వికెట్ కోల్పోయింది. చాహ‌ల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించిన నితీశ్ రాణా(22) షిమ్రాన్ హెట్మెయర్ చేతికి చిక్కాడు. దీంతో 77 ప‌రుగుల(10.2వ ఓవ‌ర్‌) వ‌ద్ద కోల్‌క‌తా మూడో వికెట్ కోల్పోయింది. 11 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 79/3. ఆండ్రీ ర‌స్సెల్‌(1), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(26) లు క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 08:18 PM (IST)

    రెండు సిక్స్‌లు, ఫోర్‌

    ప‌దో ఓవ‌ర్‌ను ర‌విచంద్ర‌న్ అశ్విన్ వేయ‌గా 18 ప‌రుగులు వ‌చ్చాయి. వెంక‌టేశ్ అయ్యర్ వ‌రుస‌గా రెండు, మూడు బంతుల‌ను సిక్స్‌లుగా మ‌ల‌చ‌గా ఆఖ‌రి బంతికి నితీశ్ రాణా బౌండ‌రీ బాదాడు.10 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 76/2. నితీశ్ రాణా(22), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(24) లు క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 08:11 PM (IST)

    నితీశ్ రాణా ఫోర్

    తొమ్మిదో ఓవ‌ర్‌ను జో రూట్ వేయ‌గా 8 ప‌రుగులు వ‌చ్చాయి. రెండో బంతికి రాణా ఫోర్ కొట్టాడు. 9 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 58/2. నితీశ్ రాణా(17), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(11) లు క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 08:08 PM (IST)

    6 ప‌రుగులు

    ఎనిమిదో ఓవ‌ర్‌ను ర‌విచంద్ర‌న్ అశ్విన్ వేయ‌గా 6 ప‌రుగులు వ‌చ్చాయి. 8 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 50/2. నితీశ్ రాణా(11), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(9) లు క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 08:04 PM (IST)

    7 ప‌రుగులు

    ఏడో ఓవ‌ర్‌ను జో రూట్ వేయ‌గా 7 ప‌రుగులు వ‌చ్చాయి. 7 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 44/2. నితీశ్ రాణా(8), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(5) లు క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 08:01 PM (IST)

    ప‌వ‌ర్ ప్లే

    కోల్‌క‌తా ఇన్నింగ్స్‌లో ప‌వ‌ర్ ప్లే ముగిసింది. ఆరో ఓవ‌ర్‌ను ర‌విచంద్ర‌న్ అశ్విన్ క‌ట్టుదిట్టంగా వేయ‌డంతో 2 ప‌రుగులు వ‌చ్చాయి. 6 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 37/2. నితీశ్ రాణా(6), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(2) లు క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 07:53 PM (IST)

    రహ్మానుల్లా గుర్బాజ్ ఔట్‌

    కోల్‌క‌తాకు వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో సందీప్ శ‌ర్మ క్యాచ్ అందుకోవ‌డంతో రహ్మానుల్లా గుర్బాజ్ ఔట్ అయ్యాడు. దీంతో 29 ప‌రుగుల(4.1వ ఓవ‌ర్‌) వ‌ద్ద కోల్‌క‌తా రెండో వికెట్ కోల్పోయింది. 5 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 35/2. నితీశ్ రాణా(5), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(1) లు క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 07:50 PM (IST)

    రహ్మానుల్లా గుర్బాజ్ రెండు సిక్స్‌లు

    నాలుగో ఓవ‌ర్‌ను సందీప్ శ‌ర్మ వేయ‌గా 15 ప‌రుగులు వ‌చ్చాయి. మొద‌టి రెండు బంతుల‌ను రహ్మానుల్లా గుర్బాజ్ సిక్స్‌లుగా మ‌లిచాడు. 4 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 29/1. రహ్మానుల్లా గుర్బాజ్(18), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(1) లు క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 07:46 PM (IST)

    జేస‌న్ రాయ్ ఔట్‌

    కోల్‌క‌తాకు భారీ షాక్ త‌గిలింది. ఫామ్‌లో ఉన్న జేస‌న్ రాయ్‌(10) ఔట్ అయ్యాడు. బౌల్ట్ బౌలింగ్‌లో షిమ్రాన్ హెట్మెయర్ క్యాచ్ అందుకోవ‌డంతో 14 ప‌రుగుల(2.2వ ఓవ‌ర్‌) వ‌ద్ద కోల్‌క‌తా తొలి వికెట్‌ను కోల్పోయింది. 3 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 14/1. రహ్మానుల్లా గుర్బాజ్(4), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(0) లు క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 07:41 PM (IST)

    రహ్మానుల్లా గుర్బాజ్ ఫోర్

    రెండో ఓవ‌ర్‌ను సందీప్ శ‌ర్మ వేయ‌గా 4 ప‌రుగులు వ‌చ్చాయి. నాలుగో బంతికి రహ్మానుల్లా గుర్బాజ్ ఫోర్ కొట్టాడు. 2 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 10/0. రహ్మానుల్లా గుర్బాజ్(4), జేసన్ రాయ్(6) లు క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 07:35 PM (IST)

    జేస‌న్ రాయ్ ఫోర్‌

    కోల్‌క‌తా బ్యాటింగ్ ప్రారంభించింది. రహ్మానుల్లా గుర్బాజ్, జేసన్ రాయ్ లు ఓపెన‌ర్లుగా బ‌రిలోకి దిగారు. తొలి ఓవ‌ర్‌ను ట్రెంట్ బౌల్ట్ వేశాడు. నాలుగో బంతికి రాయ్ ఫోర్ కొట్టాడు. 1 ఓవ‌ర్‌కు కోల్‌క‌తా స్కోరు 6/0. రహ్మానుల్లా గుర్బాజ్(0), జేసన్ రాయ్(6) లు క్రీజులో ఉన్నారు.

  • 11 May 2023 07:10 PM (IST)

    రాజస్థాన్ రాయల్స్ తుది జ‌ట్టు

    యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్‌), జో రూట్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, కేఎం ఆసిఫ్, యుజువేంద్ర చాహల్

  • 11 May 2023 07:10 PM (IST)

    కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జ‌ట్టు

    రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీప‌ర్), జేసన్ రాయ్, వెంకటేశ్‌ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్‌), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్ర‌వ‌ర్తి

  • 11 May 2023 07:06 PM (IST)

    టాస్ గెలిచిన రాజ‌స్థాన్‌

    టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంస‌న్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో కోల్‌క‌తా మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది.