IPL2022 Mumbai Vs Chennai : చెన్నై ఇక ఇంటికే.. ముంబై చేతిలో చిత్తు | IPL2022 Mumbai Vs Chennai Mumbai Indians Beat Chennai Super Kings By 5 Wickets

IPL2022 Mumbai Vs Chennai : చెన్నై ఇక ఇంటికే.. ముంబై చేతిలో చిత్తు

ఐపీఎల్ 2022 సీజన్ 15లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. ధోనీ సేన ఇంటి దారి పట్టింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైంది.

IPL2022 Mumbai Vs Chennai : చెన్నై ఇక ఇంటికే.. ముంబై చేతిలో చిత్తు

IPL2022 Mumbai Vs Chennai : ఐపీఎల్ 2022 సీజన్ 15లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. ధోనీ సేన ఇంటి దారి పట్టింది. ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై ఘోర పరాజయం పాలైంది. ముంబైతో పోరులో ఓటమి చవిచూసిన చెన్నై.. ఫ్లే ఆఫ్స్ అవ‌కాశాల‌ను చేజార్చుకుంది. దాంతో పాటే ముంబై మాదిరే ఇంటిదారి ప‌ట్టింది.

ముంబై బౌలర్ల ధాటికి తొలుత ధోనీ సేన 97 పరుగులకే ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ముంబై 5 వికెట్లు కోల్పోయి 14.5 ఓవర్లలో 103 పరుగులు చేసి విజయం సాధించింది.(IPL2022 Mumbai Vs Chennai)

ముంబై బ్యాటర్లలో తిలక్‌ వర్మ (34*) రాణించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (18), హృతిక్‌ షోకీన్‌ (18), టిమ్‌ డేవిడ్ (16*) ఫర్వాలేదనిపించారు. ఛేదనలో ముంబై ఆరంభంలో తడబడినా.. చివరకు లక్ష్యాన్ని ఛేదించింది. చెన్నై బౌలర్లలో ముకేశ్‌ చౌదరి మూడు వికెట్లు పడగొట్టాడు. మొయిన్‌ అలీ, సిమర్‌జిత్ సింగ్ ఒక్కో వికెట్‌ తీశారు. ఈ విజయంతో ముంబైకి పెద్దగా ప్రయోజనం లేకపోయినా.. ఓడిపోయిన చెన్నై కూడా ఇంటిముఖం పట్టక తప్పదు.

IPL 2022: “నా అరంగేట్ర మ్యాచ్ చూడటానికి బెటాలియన్ అంతా ప్లాన్ చేసింది”

గతంలో ఎన్నడూ లేనంతగా వైఫల్యాల బాటలో నడుస్తున్న చెన్నై… ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో తడబాటుకు గురైంది. ముంబై బౌలర్ల ధాటికి చెన్నై జట్టు 16 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ ధోనీ 36 పరుగులతో(*) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ధోనీ రాణించడంతో చెన్నై ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

ముంబయి బౌలర్ డానియెల్ సామ్స్ చెన్నై జట్టును ఆరంభంలోనే దెబ్బతీశాడు. ఫామ్ లో ఉన్న డెవాన్ కాన్వే (0) వికెట్ తీసిన శామ్స్… ఆ తర్వాత మొయిన్ అలీ (0), రుతురాజ్ గైక్వాడ్ (7)లను అవుట్ చేశాడు. శామ్స్ కు తోడు బుమ్రా (1 వికెట్), రిలే మెరిడిత్ (2 వికెట్లు), కుమార్ కార్తికేయ (2 వికెట్లు), రమణ్ దీప్ సింగ్ (1 వికెట్) కూడా రాణించడంతో చెన్నై జట్టు పరుగులు సాధించేందుకు విలవిల్లాడింది.

ఓ దశలో ఆ జట్టు 39 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అయితే, ధోనీ (36), రాయుడు (10), శివమ్ దూబే (10), డ్వేన్ బ్రావో (12) తలో చేయి వేయడంతో చెన్నై స్కోరు 90 మార్కు దాటింది.

ప్రస్తుత సీజన్‌లో ముంబై 12 మ్యాచుల్లో కేవలం మూడు మ్యాచుల్లోనే విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు ఎప్పుడో దూరమైంది. మరోవైపు చెన్నై 12 మ్యాచుల్లో 4 విజయాలు నమోదు చేసింది. చెన్నై 8 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. ముంబై 6 పాయింట్లతో అట్టడగున ఉంది.

MS Dhoni: జడేజా స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం -ఎంఎస్ ధోనీ

ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక విక్ట‌రీలు న‌మోదు చేసిన జ‌ట్లుగా, అత్యధిక సార్లు టైటిల్ నెగ్గి చాంపియన్లుగా ముంబై ఇండియ‌న్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ గుర్తింపు సంపాదించుకున్నాయి. అయితే ఐపీఎల్ తాజా సీజ‌న్‌లో మాత్రం ఈ రెండు జ‌ట్లు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌తో, వరుస ఓటములతో పాయింట్ల పట్టిక‌లో అట్ట‌డుగున నిలిచాయి. ముందుగా ముంబై, ఆ తర్వాత చెన్నై ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు చేజార్చుకున్నాయి. తాజాగా డూ ఆర్ డై మ్యాచ్ లో ఓడిన చెన్నై.. ముంబై మాదిరే ఇంటిదారి పట్టింది.

జట్ల వివరాలు:

చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్‌ గైక్వాడ్, డేవన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, మొయిన్ అలీ, శివమ్‌ దూబే, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), డ్వేన్ బ్రావో, మహీశ్ తీక్షణ, సిమర్‌జిత్ సింగ్, ముకేశ్ చౌదరి.

ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్‌ కిషన్, తిలక్‌ వర్మ, ట్రిస్టన్ స్టబ్స్‌, రమణ్‌దీప్‌ సింగ్‌, టిమ్ డేవిడ్, డానియల్ సామ్స్, కుమార్‌ కార్తికేయ, హృతిక్ షోకీన్, బుమ్రా, రిలే మెరెడిత్‌.

×