IPL2022 Mumbai Vs SRH : రాణించిన రాహుల్ త్రిపాఠి.. ముంబై టార్గెట్ ఎంతంటే

హైదరాబాద్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి హాఫ్ సెంచరీతో మెరిశాడు. త్రిపాఠి 44 బంతుల్లో 76 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 9 ఫోర్లు, మూడు సిక్స్ లు ఉన్నాయి.

IPL2022 Mumbai Vs SRH : రాణించిన రాహుల్ త్రిపాఠి.. ముంబై టార్గెట్ ఎంతంటే

Ipl2022 Mumbai Vs Srh

IPL2022 Mumbai Vs SRH : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా హైదరాబాద్ సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ముంబయికి 194 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. కాగా, స్వల్ప వ్యవధిలో వికెట్లు పడటంతో హైదరాబాద్‌ భారీ స్కోరును సాధించలేకపోయింది.

హైదరాబాద్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి హాఫ్ సెంచరీతో మెరిశాడు. త్రిపాఠి 44 బంతుల్లో 76 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 9 ఫోర్లు, మూడు సిక్స్ లు ఉన్నాయి. ఓపెనర్ ప్రియమ్‌ గార్గ్ (42), నికోలస్‌ పూరన్ (38) ఫర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లలో అభిషేక్ శర్మ 9, మార్‌క్రమ్ 2, కేన్‌ విలియ్సన్ 8*, సుందర్‌ 9 పరుగులు చేశారు.

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని రాసిన లెటర్‌కు ధోనీ సూపర్ రియాక్షన్

ముంబై బౌలర్లలో రమణ్‌దీప్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. డానియల్‌ సామ్స్, రిలే మెరిడెత్, బుమ్రా తలో వికెట్ తీశారు. ఇక టీ20 ఫార్మాట్‌లో 250 వికెట్లు తీసిన బౌలర్‌గా బుమ్రా ఘనత వహించాడు.

కాగా, హైదరాబాద్ జట్టుకి సాంకేతికతంగా మాత్రమే ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్‌ 12 మ్యాచులకుగాను ఐదు విజయాలతో 10 పాయింట్లు సాధించి పాయింట్ల టేబుల్ లో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక మిగిలిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధిస్తే.. ఇతర జట్లు సాధించే ఫలితాలపై హైదరాబాద్ కి కొంత వరకు అవకాశాలు ఉంటాయి.

ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిపాలైతే మాత్రం ఇంటిముఖం పట్టక తప్పదు. మరోవైపు ముంబైకి ఇప్పటికే దారులు మూసుకుపోయాయి. కేవలం మూడు విజయాలను మాత్రమే నమోదు చేసింది. అయితే ఇతర జట్ల ఫలితాలను ప్రభావితం చేసే ఛాన్స్‌ మాత్రం రోహిత్ సేన ముందుంది. అలాగే మిగిలిన మ్యాచుల్లో విజయం సాధించి కాస్త గౌరవంగా టోర్నీ ముగించాలని ముంబై అభిమానులు ఆశిస్తున్నారు.

IPL2022 PunjabKings Vs DC : దుమ్మురేపిన ఢిల్లీ.. ప్లేఆఫ్స్ ఆశలు సజీవం.. పంజాబ్ ఇంటికే

సన్ రైజర్స్ హైదరాబాద్‌ జట్టు : అభిషేక్ శర్మ, ప్రియమ్‌ గార్గ్‌, కేన్‌ విలియమ్సన్ (కెప్టెన్‌), రాహుల్ త్రిపాఠి, మార్‌క్రమ్, నికోలస్‌ పూరన్, వాషింగ్టన్‌ సుందర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఫరూఖి, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్‌.

ముంబై ఇండియన్స్ జట్టు : ఇషాన్‌ కిషన్‌, రోహిత్ శర్మ (కెప్టెన్‌), డానియల్ సామ్స్, తిలక్ వర్మ, రమణ్‌దీప్‌ సింగ్, త్రిస్టాన్‌ స్టబ్స్, టిమ్‌ డేవిడ్, సంజయ్ యాదవ్, బుమ్రా, రిలే మెరెడిత్, మయాంక్‌ మార్కండే.