ధోనీ.. 33 పరుగుల దూరంలో ఉన్న రికార్డు కొట్టేస్తాడా..

  • Published By: vamsi ,Published On : March 8, 2019 / 09:49 AM IST
ధోనీ.. 33 పరుగుల దూరంలో ఉన్న రికార్డు కొట్టేస్తాడా..

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి వయస్సు మాత్రమే అయిపోతుంది. అతనికున్న క్రేజ్.. క్రికెటర్‌గా దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ మ్యాచ్ ఫినిషర్‌గా రెచ్చిపోతున్నాడు మహీ. ఆస్ట్రేలియాతో ఆడిన తొలి వన్డేలో మ్యాచ్ చివరి వరకూ క్రీజులో నిలబడి 59 పరుగుల చేసిన ధోనీ విజయంతో ముగించాడు. 

ఇక మూడో వన్డేను సొంతగడ్డపై ఆడుతున్న కోహ్లీసేనలో భాగమైన ధోనీ ముంగిట ఓ అరుదైన రికార్డు ఎదురుచూస్తోంది. ఇంకా 33పరుగుల చేస్తే ధోనీ 17వేల పరుగుల మైలురాయిని చేరుకున్నట్లే. ఆసియా ఎలెవన్, ఇండియా జట్ల తరపున ఆడిన ధోనీ.. 16,967పరుగులతో కొనసాగుతున్నాడు. 
Also Read : సైన్యానికి సెల్యూట్ : ఆర్మీ క్యాప్‌లతో బరిలోకి భారత్

టీమిండియా తరపున అంతర్జాతీయ మ్యాచ్‌లలో మాత్రం టెస్టుల్లో 4,876పరుగుల, వన్డేల్లో 10,474పరుగులు, టీ20ల్లో 1,617పరుగులు చేయగలిగాడు. అత్యధిక వన్డే పరుగులు చేసిన జాబితాలో సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, రాహుల్ ద్రవిడ్ 24,208 పరుగులు, విరాట్ కోహ్లీ 19,453పరుగులు, సౌరవ్ గంగూలీ 18,575పరుగులు, వీరేంద్ర సెహ్వాగ్ 17,523పరుగులతో ఉన్నారు. 
Also Read : సోషల్ మీడియాలో కామెంట్లపై బిగ్ బాస్ కౌశల్ కంప్లయింట్