Kane Williamson: కివీస్ జట్టుకు బిగ్ షాక్.. వన్డే వరల్డ్‌కప్‌కు కేన్ విలియమ్సన్ డౌటే?
న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ కుడికాలు మోకాలుకు బలంగా గాయమైంది. రెండురోజుల క్రితం ఇండియా నుంచి గాయంతో స్వదేశానికి వెళ్లాడు.

new zealand cricketer kane williamson
Kane Williamson: న్యూజిలాండ్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు కేన్ విలియమ్సన్ కొద్దికాలం ఆ జట్టుకు అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఐపీఎల్ 2023టోర్నీలో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న కేన్ విలియమ్సన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ లో గాయపడ్డాడు. సీఎస్‌కే బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఇచ్చిన క్యాచ్ ను అందుకోబోతూ బౌండరీ లైన్ లో విలియమ్సన్ గాయపడ్డాడు. కాలుకు తీవ్రంగా గాయం కావడంతో గ్రౌండ్ లోనే కుప్పకూలిపోయాడు.
Kane Williamson Video: అయ్యయ్యో.. కుడి కాలు కదిలించలేని స్థితిలో సొంత దేశానికి కేన్ విలియమ్సన్
విలియమ్సన్ కుడి కాలు మోకాలు గ్రౌండ్‌కు బలంగా గాయమైంది. రెండురోజుల క్రితం ఇండియా నుంచి గాయంతో కేన్ విలియమ్సన్ స్వదేశానికి వెళ్లాడు. అక్కడి వైద్యులు కేన్ గాయాన్ని పరిశీలించి సర్జరీ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఒకవేళ సర్జరీ చేయించుకుంటే సుమారు ఆరు నెలలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది చివరిలో భారత్‌దేశంలో జరిగే 50 ఓవర్ల ప్రపంచ కప్‌కు కేన్ విలియమ్సన్ అందుబాటులో ఉండడని సమాచారం. అదే జరిగితే న్యూజిలాండ్ జట్టుకు బిగ్ షాక్ అనే చెప్పాలి. ఈ విషయంపై న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ.. 32ఏళ్ల కేన్ అక్టోబర్‌లో ప్రారంభమయ్యే వన్డే ప్రపంచ కప్ లో ఆడడటం కష్టమేనని చెప్పాడు.
Kane Williamson: కేన్ విలియమ్సన్ వీరబాదుడు.. సచిన్, సెహ్వాగ్ సరసన కివీస్ బ్యాటర్
భారత్‌లో ఈ ఏడాది చివర్లో అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. ఈ మెగా టోర్నీలో విలియమ్సన్ లేకపోవటం న్యూజిలాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ అవుతుంది. ఇప్పటి వరకు ఈ జట్టు ప్రపంచ కప్ గెలుచుకోలేదు. కానీ గత రెండు సార్లు రన్నరప్ గా నిలిచింది. ఈ సారి ఎలాగైనా వరల్డ్ కప్ లో విజేతగా నిలవాలని ఆ జట్టు భావిస్తుంది. ఇలాంటి తరుణంలో విలియమ్సన్ జట్టుకు అందుబాటులో ఉండకపోతే ఆ జట్టు వరల్డ్ కప్ ఫైనల్ కు చేరడం కష్టతరమనే చెప్పాలి.
Kane Williamson: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అనూహ్య నిర్ణయం.. రంగంలోకి టిమ్ సౌథీ
గాయంపై కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ.. సహజంగా అటువంటి గాయం అవ్వటం నిరాశపర్చిందని అన్నారు. కానీ ఇప్పుడు నా దృష్టి శస్త్రచికిత్స చేయించుకోవటం, వేగంగా రికవరీ అవ్వటంపై ఉందని అన్నారు. కొంత సమయం పడుతుందని, వీలైనంత త్వరలో మైదానంలోకి రావడానికి నేనే చేయగలిగినదంతా చేస్తానని విలియమ్సన్ చెప్పారు.