కొంపముంచిన ప్రస్టేషన్, యూఎస్ ఓపెన్ నుంచి జొకోవిచ్ నిష్క్రమణ

  • Published By: madhu ,Published On : September 7, 2020 / 10:36 AM IST
కొంపముంచిన ప్రస్టేషన్, యూఎస్ ఓపెన్ నుంచి జొకోవిచ్ నిష్క్రమణ

Novak Djokovic : ప్రపంచ నెంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ కు షాక్ తగిలింది. అతను కొట్టిన బంతి..నేరుగా లైన్ జడ్జి మెడకు తాకడంతో యూఎస్ ఓపెన్ నుంచి తొలగాల్సి వచ్చింది. ఉద్దేశ్యపూర్వకంగా కొట్టకపోయినా..నిబంధనల ప్రకారం..గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని..టోర్నీ నుంచి తొలగించాల్సి వచ్చింది.



ఆదివారం అర్థర్ ఆషే స్టేడియంలో యూఎస్ ఓపెన్ టోర్నీల మ్యాచ్ జరుగుతోంది. పాబ్లో కారెనో బాస్టా – జొకోవిచ్ తలపడుతున్నారు. తొలి సెట్ లో 6-5తో వెనుకబడిపోయాడు. మొదటి సెట్ అనంతరం ఛేంజ్ ఓవర్ కోసం పక్కకు వెళుతూ..బంతిని వెనక్కు కొట్టాడు. ఇది నేరుగా వెళ్లి లైన్ జడ్జి మెడకు బలంగా తగిలింది.
https://10tv.in/shocking-father-friend-and-his-barge-into-daughters-room-after-drinking-molest-her/
దీంతో కిందపడిపోయింది. ఈ ఘటనపై టోర్నమెంట్ రిఫరీ సోరెన్ ప్రైమెల్ తో సహా కోర్టులో అధికారులతో చర్చించారు. గతంలో జరిగిన పరిణాలను పరిగణలోకి తీసుకున్నారు. ఛైర్ అంపైర్ అరేలీ టూర్జే జకోవిచ్ ను డిఫాల్ట్ గా ప్రకటించారు. పొరపాటున జరిగినా..నిబంధనల ప్రకారం అతడిని తప్పించారు.



టెన్నిస్ లో ఇద్దరు ప్రముఖులు ఫెడరర్, రాఫెల్ నాదల్ గైర్హాజర్ లో వరల్డ్ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను ఎగురకేసుందామని అనుకున్నాడు. కరోనా ప్రత్యేక పరిస్థితుల నడుమ ఆరంభమైన యూఎస్‌ ఓపెన్‌ టోర్నీలో ఈ సెర్బియా స్టార్‌ సునాయాస విజయంతో రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు.