ODI World Cup 2023 : ఉత్తమ ఫీల్డర్ గా మరోసారి పతకాన్ని అందుకున్న కేఎల్ రాహుల్.. వీడియో వైరల్
రాహుల్ లక్నోలో ఇంగ్లాండ్ పై మ్యాచ్ లో స్టంప్స్ వెనుక అద్భుతమైన ప్రతిభ కనబర్చాడు. లెగ్ సైడ్ లో రెండు బౌండరీలు అడ్డుకున్నాడని అన్నారు.

KL Rahul
KL Rahul Fielder of the Match : వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా విజయ జైత్రయాత్ర కొనసాగుతోంది. లక్నో వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి టీమిండియా చేరుకుంది. ఇండియా – ఇంగ్లాండ్ మ్యాచ్ అనంతరం డ్రస్సింగ్ రూంలో టీమిండియా ఉత్తమ ఫీల్డర్ అవార్డును ఫీల్డింగ్ కోచ్ ప్రకటించాడు. కేఎల్ రాహుల్ ను ఉత్తమ ఫీల్డర్ అవార్డుకు ఎంపిక చేశారు. ఇప్పటికే విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఇతర ప్లేయర్స్ ఒకసారి ఉత్తమ ఫీల్డర్ గా బంగారు పతకాన్ని అందుకున్నారు. అయితే, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మాత్రమే రెండోసారి ఈ అవార్డు అందుకున్నారు.
ఈ సందర్భంగా ఫీల్డింగ్ కోచ్ మాట్లాడుతూ.. రాహుల్ లక్నోలో ఇంగ్లాండ్ పై మ్యాచ్ లో స్టంప్స్ వెనుక అద్భుతమైన ప్రతిభ కనబర్చాడు. లెగ్ సైడ్ లో రెండు బౌండరీలు అడ్డుకున్నాడని అన్నారు. అయితే, రాహుల్ పేరును ప్రకటించే ముందు డ్రెస్సింగ్ రూంలోని సభ్యులందరిని ఫీల్డింగ్ కోచ్ బయటకు తీసుకెళ్లారు. మైదానంలో లైట్లు బంద్ చేసి రాహుల్ పేరును ప్రదర్శించడం ద్వారా ఉత్తమ ఫీల్డర్ గా ప్రకటించారు. ఆ తరువాత శ్రేయాస్ అయ్యర్ రాహుల్ కు ఉత్తమ ఫీల్డర్ పతకాన్ని మెడలో వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్ (ఎక్స్) ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
LIGHTS OUT in Lucknow ?️
This Post-match medal ceremony was LIT(erally) Bigger & Brighter ?
Presenting a visual spectacle ?#TeamIndia | #INDvENG | #CWC23 | #MenInBlue
WATCH ?? – By @28anand
— BCCI (@BCCI) October 30, 2023