Pakistan: బాబర్ నన్ను వాడుకుని వదిలేశాడు.. పాకిస్తాన్ కెప్టెన్‌పై యువతి సంచలన ఆరోపణలు

వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ జట్టు చరిత్ర క్రియేట్ చేసింది. దుబాయ్‌ ఇంటర్నేషనల్ స్టేడియంలో టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో భారత్‌పై 10వికెట్ల తేడాతో విజయం సాధించింది పాకిస్తాన్.

Pakistan: బాబర్ నన్ను వాడుకుని వదిలేశాడు.. పాకిస్తాన్ కెప్టెన్‌పై యువతి సంచలన ఆరోపణలు

Babar

Pakistan: వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ జట్టు చరిత్ర క్రియేట్ చేసింది. దుబాయ్‌ ఇంటర్నేషనల్ స్టేడియంలో టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో భారత్‌పై 10వికెట్ల తేడాతో విజయం సాధించింది పాకిస్తాన్. జట్టు విజయంతో కెప్టెన్ బాబర్ అజామ్‌పై పాకిస్తాన్ ప్రశంసలు కురిపిస్తుంది. ఆ దేశంలో బాబర్‌‍ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

కెప్టెన్ బాబర్ అజమ్‌ను హీరోగా పరిగణిస్తోన్న సమయంలో బాబర్ అజామ్‌పై సంచలన ఆరోపణలు చేసింది ఓ యువతి. తన వ్యక్తిగత జీవితంలో చాలాసార్లు వివాదాల్లో ఉన్నప్పటికీ, బాబర్ అజామ్ స్నేహితురాలిగా తనను తాను చెప్పుకునే హమీజా ముఖ్తార్.. కొత్త వాదనను వినిపించారు. పాకిస్థానీ వార్తాపత్రిక ‘డైలీ పాకిస్థాన్’ నివేదిక ప్రకారం, బాబర్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, లైంగికంగా వాడుకుని వదిలేశాడని, తాను ఇప్పుడు బాబర్ బిడ్డకు తల్లి కాబోతున్నట్లు యువతి చెబుతోంది.

హమేజా బాబర్ ఆజంపై పాకిస్తాన్ కోర్టును కూడా ఆశ్రయించింది. పాకిస్తాన్ కెప్టెన్‌పై చిత్రహింసల కేసును నమోదు చేసింది. అయితే, ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు బాబర్ కుటుంబం తనకు రూ.20 లక్షలు ఆఫర్ చేసినట్లు కూడా అతని కుటుంబం చెబుతుంది. అతనిపై బ్లాక్ మెయిల్, చిత్రహింసల కేసు లాహోర్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.

ఖురాన్‌పై ప్రమాణం:
బాబర్ తనను లైంగికంగా వేధించాడని, డబ్బు కోసం మోసం చేశాడని హమేజా ఆరోపించింది. తాను, బాబర్ ఆజం ప్రేమించుకుంటున్నామని, 2011లో ఇంటి నుంచి పారిపోయామని చెప్పాడు. ఈ సమయంలో ఇద్దరం లాహోర్‌లోని అనేక ప్రాంతాల్లో కలిసి జీవించాము. 10 ఏళ్ల క్రితం ప్రేమ మొదలైనప్పుడు ఇద్దరం మైనర్లమేనని హమీజా చెబుతుంది. హమీజా అనేక ఆధారాలను కూడా సమర్పిస్తున్నారు. పవిత్ర ఖురాన్‌ను చేతిలో పట్టుకున్న హమీజా తన కుటుంబం ఒప్పుకోకపోవడంతో వివాహం చేసుకోవడానికి 2011లో ఇంటి నుండి పారిపోయినట్లు చెబుతున్నారు.

“బాబర్ నన్ను తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు, అక్కడ మేము చాలా రోజులు కలిసి ఉన్నాము. బాబర్‌ని పెళ్లి చేసుకోవడానికి మా ఇంట్లో రెండు లక్షల రూపాయల విలువైన నగలు దొంగిలించాను. నేను బాబర్ అజామ్ కోసం నా కారును అమ్మేశాను. అతనికి రూ.12 లక్షలు ఇచ్చాను.” అని చెప్పారు.

పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి, చాలా ఏళ్లుగా లైంగికంగా ఉపయోగించుకున్నట్లు ఆమె చెప్పింది. బాబర్ బిడ్డకు తల్లి కావల్సిన సమయంలో ఒత్తిడి చేసి అబార్షన్ చేయించాడని చెప్పింది. పిల్లలను కనేందుకు బాబర్ అంగీకరించకపోవడంతో అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చిందన్నారు.