Pakistan Cricketer Shadab Khan: కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేసిన పాక్ క్రికెటర్.. సెంచరీ చేయాలంటూనే పాక్‌పై అంతసీన్ లేదంటూ వ్యాఖ్య

పాకిస్థాన్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశారు. మా జట్టుతో ఆడేటప్పుడు పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడని మేము అనుకోవటం లేదని, అసలు కోహ్లీని మేము ఫాంలో ఉన్న బ్యాట్స్‌మెన్‌గా గుర్తించడం లేదని అన్నాడు. కానీ కోహ్లీ ఆసియా కప్‌లో సెంచరీ చేయాలని తాను కోరుకుంటున్నానని నవ్వుతూ వ్యాఖ్యానించాడు.

Pakistan Cricketer Shadab Khan: కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేసిన పాక్ క్రికెటర్.. సెంచరీ చేయాలంటూనే పాక్‌పై అంతసీన్ లేదంటూ వ్యాఖ్య

Pakistan vice-captain Shadab Khan

Pakistan Cricketer Shadab Khan: ఆసియా కప్ -2022 టీ20 టోర్నీ ఈరోజు నుంచి ప్రారంభం అవుతుంది. భారత కాలమానం ప్రకారం.. రాత్రి 7.30గంటలకు శ్రీలంక, ఆప్గానిస్థాన్ మధ్య మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభమవుతుంది. అయితే ఆసియా కప్‌లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానుల్లో ఓ ఉత్సాహం నెలకొంటుంది. రెండు దాయాది జట్లు గ్రౌండ్‌లోకి దిగితే ఆ ఉత్కంఠే వేరు. ఆదివారం రాత్రి పాక్, భారత్ మధ్య జరిగే మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే శుక్రవారం దుబాయ్‌లో ఆయా జట్లు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాయి. ఈ క్రమంలో ఇరు జట్ల క్రీడాకారులు ముచ్చటించుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Asia Cup 2022: ఇప్పటివరకు ఏ భారత క్రికెటరూ నెలకొల్పని రికార్డు రేపటితో కొహ్లీ సొంతం

కొద్దికాలం అనంతరం ఆసియా కప్‌లో భారత్ తరపున కోహ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఫాం కోల్పోయి ఇబ్బంది పడుతున్న కోహ్లీ ఆసియా కప్‌లో రాణించాలని అధికశాతం మంది కోరుకుంటున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ ఈ టోర్నీలో సెంచరీ చేయాలని కోరుకుంటున్నానని అన్నాడు. భారత్ జట్టు గెలుపుకోసం గతంలో కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడాడని షాదాబ్ గుర్తు చేశాడు. మా జట్టుతో ఆడేటప్పుడు పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడని మేము అనుకోవటం లేదని, అసలు కోహ్లీని మేము ఫాంలో ఉన్న బ్యాట్స్‌మెన్‌గా గుర్తించడం లేదని కీలక వ్యాఖ్యలు చేశాడు. కానీ కోహ్లీ ఆసియా కప్‌లో సెంచరీ చేయాలని తాను కోరుకుంటున్నానని, పాక్ మినహా ఇతర జట్లపై ఆడేటప్పుడు సెంచరీ చేయాలని నేను కోరుకుంటున్నానని నవ్వుతూ వ్యాఖ్యానించాడు.

Asia Cup 2022: నేటి నుంచి ఆసియా కప్ టీ20 టోర్నీ.. అందరిచూపు భారత్, పాక్ మ్యాచ్‌పైనే

ఆదివారం రాత్రి టీమిండియాతో జరిగే మ్యాచ్ కోసం తాము ఆసక్తిగా ఉన్నామని, కచ్చితంగా గెలుస్తామనే నమ్మకం మాలో ఉందని షాదాబ్ ఖాన్ అన్నాడు. గత ఏడాది టీ20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించిందని గుర్తు చేసిన షాదాబ్, రేపు జరిగే మ్యాచ్‌లో ఆ విజయాన్ని పునరావృతం చేస్తామన్నాడు. మాకు మంచి జట్టు ఉందని, మేము ఛాంపియన్ టీమ్ గా మారడానికి ప్రయత్నిస్తామని అన్నారు. భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ అంటే సవాలు ఎప్పుడూ ఉంటుందని, ఇరు జట్టు తలపడుతుంటే ఒత్తిడి ఉంటుందని, కానీ ఆ ఒత్తిడిని జయించి మేం విజయం సాధిస్తామని షాదాబ్ తెలిపాడు.