IND vs NZ 3rd ODI: అయ్యో పంత్..! మరోసారి పేల‌వ‌ బ్యాటింగ్‌తో నిరాశపర్చిన పంత్..

కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో భారత్ బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు నానా తంటాలు పడ్డారు. శ్రేయస్ అయ్యర్ మినహా పెద్దగా ఎవరూ రాణించలేదు. ఇక, ఈ మ్యాచ్‌లో అందరిచూపు పంత్‌పై ఉంది.

IND vs NZ 3rd ODI: అయ్యో పంత్..! మరోసారి పేల‌వ‌ బ్యాటింగ్‌తో నిరాశపర్చిన పంత్..

Panth

IND vs NZ 3rd ODI: టీమిండియా బ్యాటర్ రిషిబ్ పంత్ మరోసారి నిరాశపర్చాడు. తన పేల‌వ‌ బ్యాటింగ్ పరంపరను కొనసాగించాడు. దీంతో పంత్‌పై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంత్ ఇంకా వచ్చేయ్..! అంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. న్యూజీలాండ్ పర్యటనలో భాగంగా బుధవారం టీమిండియా క్రైస్ట్‌చర్చ్ వేదికగా మూడో వన్డే ఆడుతుంది. టాస్ గెలిచిన కివీస్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా.. స్వల్ప స్కోరుకే వరుస వికెట్లు కోల్పోయింది.

Rishabh Pant vs Sanju Samson: సంజూ వర్సెస్ రిషబ్.. వీరిలో ఎవరు గ్రేట్..! న్యూజీలాండ్‌తో వన్డే సిరీస్ వేళ ఆసక్తికర చర్చ..

కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో భారత్ బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు నానా తంటాలు పడ్డారు. శ్రేయస్ అయ్యర్ మినహా పెద్దగా ఎవరూ రాణించలేదు. ఇక, ఈ మ్యాచ్‌లో అందరిచూపు పంత్‌పై ఉంది. గతకొన్ని మ్యాచ్‌లలో పేలువ బ్యాటింగ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న పంత్ ఈ మ్యాచ్ తోనైనా తనపై వచ్చే విమర్శలు, ట్రోల్స్ కు చెక్ పెడతారని అందరూ భావించారు. కానీ మరోసారి పేలువ బ్యాటింగ్ తో పంత్ అభిమానులను నిరాశపర్చాడు.

Rishabh Pant: ఓపెనర్‌గా వెళ్లినా విఫలమయ్యాడు..! క్రికెటర్ రిషబ్ పంత్ పేలవ ప్రదర్శనపై మండిపడుతున్న ఫ్యాన్స్

కివీస్ బౌలర్ల దాటికి పంత్ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేక పోయాడు. 16 బంతులు ఎందుర్కొన్న పంత్ కేవలం 10 పరుగులు మాత్రమే చేసి మిచెల్ బౌలింగ్‌లో ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇటీవల కాలంలో పంత్ వరుస మ్యాచ్‌లలో విఫలమవుతూ వస్తున్నాడు. ఇప్పటికే పంత్ స్థానంలో తుదిజట్టులోకి సంజూ శాంసన్‌ను తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ పెద్దఎత్తున వినిపిస్తోంది. కానీ టీమిండియా సెలక్టర్లు మాత్రం పంత్ పై ఎక్కువ నమ్మకం చూపుతుండటం గమనార్హం. ఈ క్రమంలో వారి నమ్మకాన్ని వమ్ముచేస్తూ పంత్ మరోసారి విఫలం అయ్యాడు.

ఈ ఆరోపణలను పక్కనబెడితే.. కివీస్‌తో మూడో వన్డే ప్రారంభానికి ముందు కామెంటేటర్ హర్షా భోగ్లే అడిగిన ప్రశ్నలకు రిషబ్ పంత్ ఇబ్బంది పడ్డాడు. ‘వీరేంద్ర సెహ్వాగ్‌ను చాలా ఏళ్ల క్రితమే ఈ ప్రశ్న అడిగాను. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను. నిన్ను చూస్తుంటే.. వైట్ బాల్ క్రికెటర్‌గా కంటే నీ టెస్ట్ రికార్డ్ మెరుగ్గా ఉన్నట్టు కనిపిస్తోంది?’ అని పంత్‌ను భోగ్లే అడిగాడు. దీనికి రిషబ్ బదులిస్తూ.. సార్, రికార్డులనేవి కేవలం అంకెలు మాత్రమే. నా వైట్ బాల్ రికార్డ్ దారుణంగా కూడా లేదు కదా అంటూ పంత్ పేర్కొన్నారు. ఇప్పుడు నా వయసు 24-25 ఏళ్లు. నాకు 30-32 ఏళ్లు వచ్చినప్పుడు నా పరిమిత ఓవర్ల క్రికెట్ గణాంకాలను, టెస్టు రికార్డులతో పోల్చి చూడండి అంటూ పంత్ సమాధానమిచ్చాడు.