Harbhajan Singh On Kohli form: కొన్నేళ్ళుగా విరాట్ కొహ్లీ ముఖంలో ఒత్తిడి స్పష్టంగా కనపడుతోంది: హర్బజన్ సింగ్

కొంత కాలంగా టీమిండియా బ్యాట్స్‌మన్ విరాట్ కొహ్లీ మెరుగైన ఆటతీరు కనబర్చకపోతుండడంపై మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ పలు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కొహ్లీ ఆసియా కప్ లో ఆడుతున్న నేపథ్యంలో ఓ ఇంర్వ్యూలో హర్బజన్ సింగ్ మాట్లాడుతూ... ''విరాట్ కొహ్లీ తన కెరీర్ లో ఎన్నో పరుగులు చేశాడు. అయితే, కొన్నేళ్ళుగా అతడి ముఖంలో ఒత్తిడి స్పష్టంగా కనపడుతోంది. సెంచరీలు కొట్టలేకపోతున్నాడు. కెప్టెన్సీకి కూడా కొహ్లీ దూరమయ్యాడు. ఇప్పుడు మాత్రం కొహ్లీ ప్రశాంతంగా ఉన్నట్లు కనపడుతున్నాడు'' అని చెప్పాడు.

Harbhajan Singh On Kohli form: కొన్నేళ్ళుగా విరాట్ కొహ్లీ ముఖంలో ఒత్తిడి స్పష్టంగా కనపడుతోంది: హర్బజన్ సింగ్

Harbhajan Singh

Harbhajan Singh On Kohli form: కొంత కాలంగా టీమిండియా బ్యాట్స్‌మన్ విరాట్ కొహ్లీ మెరుగైన ఆటతీరు కనబర్చకపోతుండడంపై మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ పలు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కొహ్లీ ఆసియా కప్ లో ఆడుతున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో హర్బజన్ సింగ్ మాట్లాడుతూ… ”విరాట్ కొహ్లీ తన కెరీర్ లో ఎన్నో పరుగులు చేశాడు. అయితే, కొన్నేళ్ళుగా అతడి ముఖంలో ఒత్తిడి స్పష్టంగా కనపడుతోంది. సెంచరీలు కొట్టలేకపోతున్నాడు. కెప్టెన్సీకి కూడా కొహ్లీ దూరమయ్యాడు. ఇప్పుడు మాత్రం కొహ్లీ ప్రశాంతంగా ఉన్నట్లు కనపడుతున్నాడు” అని చెప్పాడు.

”ప్రాక్టీసుకు వెళ్ళే ముందు 1-2 గంటలు జిమ్ లో గడుపుతాడు. మనం ఏ పెద్ద ఆటగాడి గురించి చెప్పుకున్నా వారి కెరీర్ లో ఎత్తుపల్లాలు ఉంటాయి. కొహ్లీ మళ్ళీ బాగా ఆడగలడనడంతో ఎటువంటి సందేహమూ లేదు” అని హర్బజన్ సింగ్ అన్నారు. కాగా, అన్ని ఫార్మాట్లలో 100 మ్యాచులు పూర్తి చేసుకున్న మొట్టమొదటి భారత క్రికెటర్ గా కొహ్లీ ఇవాళ రికార్డు నెలకొల్పనున్నాడు.

పాక్ తో నేడు జరగనున్న మ్యాచ్ లో అతడు ఎలా ఆడతాడన్న ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచుతోనైనా మళ్ళీ ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. ఆసియా కప్ ను టీమిండియా రోహిత్ శర్మ సారథ్యంలో ఆడుతుంది. దుబాయి, షార్జాలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్లో భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది.

Chinese construction work: మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న చైనా.. అరుణాచల్‌ ప్రదేశ్‌లో నిర్మాణాలు?