ICC T20 : 2022 టీ20 వరల్డ్‌కప్.. ఏడు వేదికలు ప్రకటించిన ఆసీస్

2022 టీ20 క్రికెట్ వరల్డ్‌కప్ టోర్నీకి ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్‌ల నిర్వహణ కోసం ఏడు వేదికలను ఖరారు చేసింది ఆస్ట్రేలియా.

ICC T20 : 2022 టీ20 వరల్డ్‌కప్.. ఏడు వేదికలు ప్రకటించిన ఆసీస్

Icc T20

ICC T20 : 2022 టీ20 క్రికెట్ వరల్డ్‌కప్ టోర్నీకి ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్‌ల నిర్వహణ కోసం ఏడు వేదికలను ఖరారు చేసింది ఆస్ట్రేలియా. ఈ టోర్నీ వచ్చే ఏడాది అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 మధ్య నిర్వహించనున్నారు.. మొత్తం 45 మ్యాచ్‌లు ఉంటాయి. ఈ మ్యాచ్‌ల కోసం ఆడిలైడ్‌, బ్రిస్బేన్‌, గీలాండ్‌, హోబ‌ర్ట్‌, మెల్‌బోర్న్‌, పెర్త్‌, సిడ్నీ వేదికలను సిద్ధం చేస్తున్నారు.

చదవండి : NZ vs AUS : తుది పోరుకు వేళాయే…ఆస్ట్రేలియా – న్యూజిలాండ్..ఏ జట్టు గెలిచేనో

సిడ్నీ, అడిలైడ్ వేదిక‌ల్లో సెమీస్ మ్యాచ్‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఇక ఈ టోర్నీలో పాల్గొనేందుకు 12 జ‌ట్లు లైన‌ప్‌లో ఉన్నాయ‌ని, క్వాలిఫికేష‌న్ ప్ర‌క్రియ పూర్తి అయ్యే వ‌ర‌కు వేచి ఉండాల్సి ఉంద‌ని ఈవెంట్ హెడ్ క్రిస్ టెట్లే తెలిపారు. ఇక వ‌చ్చే ఏడాది జ‌రిగే టోర్నీలో స్వంత గ‌డ్డ‌పై ఆ జ‌ట్టు ఫెవ‌రేట్‌గా బ‌రిలో దిగే ఛాన్సుంది. ఇక న్యూజిలాండ్‌తో పాటు ఆఫ్ఘ‌నిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌, ఇండియా, పాకిస్థాన్‌, సౌతాఫ్రికాలు వ‌చ్చే టోర్నీకి సెల‌క్ట్ అయ్యాయి.

చదవండి : ICC T20 : ప్రమాదం నుంచి తప్పించుకున్న అంపైర్..వీడియో వైరల్

సూప‌ర్‌12 అర్హ‌త కోసం శ్రీలంక, వెస్టిండీస్‌లు ప్రిలిమిన‌రీ రౌండ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెలిసిందే.. న్యూజిలాండ్‌తో ఫైనల్ పోరులో తలపడిన ఆస్ట్రేలియా విజయం సాధించింది.