T20 World Cup IndVsPak : వాటే మ్యాచ్.. ఉత్కంఠపోరులో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. విరాట్ కోహ్లి విశ్వరూపం

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా 4 వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చేసింది.

T20 World Cup IndVsPak : వాటే మ్యాచ్.. ఉత్కంఠపోరులో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. విరాట్ కోహ్లి విశ్వరూపం

T20 World Cup IndVsPak : టీ20 వరల్డ్ కప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. చివరి బంతి వరకు నరాలు తెగేంత ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా 4 వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చేసింది. పాక్ నిర్దేశించిన 160 పరుగుల టార్గెట్ ను 6 వికెట్లు కోల్పోయి చివరి బంతికి ఫినిష్ చేసింది.

మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌లో కింగ్ విరాట్‌ కోహ్లీ (82*) విశ్వరూపం చూపించాడు. ఒంటి చేత్తో జట్టుని గెలిపించాడు. కోహ్లి హాఫ్ సెంచరీతో మెరిశాడు. 53 బంతుల్లో 82 పరగులతో అజేయంగా నిలిచి టీమిండియా విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. విరాట్ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. మరో ఎండ్ లో పాండ్యా సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. పాండ్యా 37 బంతుల్లో 40 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో ఒక ఫోర్, 2 సిక్సులు ఉన్నాయి.

మ్యాచ్ గెలిచిన అనంతరం జట్టులో సంబరాలు అంబరాన్నంటాయి. కెప్టెన్ రోహిత్ శర్మ ఆనందానికి అవధులు లేవు. విరాట్ ను భుజాలపై ఎత్తుకుని సంతోషంగా తిప్పాడు. మిగతా సహచర ప్లేయర్లు కూడా కోహ్లిని అభినందించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

రెండో ఓవర్ లో బ్యాటింగ్ వచ్చిన విరాట్ కోహ్లి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. చివరి వరకు క్రీజులో నిలిచి ఇండియాను గెలిపించాడు. ఒకవైపు వికెట్లు పడుతుననా తన మార్క్ ఆటతో అలరించాడు. ఒకరకండా విశ్వరూపం చూపించాడు. మరోసారి చేజింగ్ కింగ్ అని ప్రూవ్ చేసుకున్నాడు. పాకిస్తాన్ తో పోరు అనగానే విరాట్ రెచ్చిపోతాడు. పాక్ తో గత 6 ఇన్నింగ్స్ లలో విరాట్ 82*, 60,35,57,55,49 రన్స్ చేయడం విశేషం.

ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో షాన్‌ మసూద్‌ (52*), ఇఫ్తికార్‌ అహ్మద్‌ (51) రన్స్‌ చేయడంతో ఆ జట్టు 159 పరుగులు చేసింది. ఆపై బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.

31 పరుగులకే 4వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును విరాట్‌ కోహ్లీ-హార్దిక్‌ పాండ్యా ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు శతక భాగస్వామ్యం జోడించారు. ఆ తర్వాత పాండ్య ఔటవగా.. కోహ్లీ చివరి వరకూ క్రీజ్‌లో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.