Suryakumar Yadav: బ్యాటింగ్‌లో తడబడ్డ టీమిండియా.. ఆదుకున్న సూర్య కుమార్ యాదవ్.. దక్షిణాఫ్రికా విజయ లక్ష్యం 134

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఆదివారం సాయంత్రం జరుగుతున్న మ్యాచులో భారత బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. సూర్య కుమార్ యాదవ్ ఒక్కడే అర్ధ శతకం సాధించి భారత జట్టుకు అండగా నిలిచాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగులు సాధించింది.

Suryakumar Yadav: బ్యాటింగ్‌లో తడబడ్డ టీమిండియా.. ఆదుకున్న సూర్య కుమార్ యాదవ్.. దక్షిణాఫ్రికా విజయ లక్ష్యం 134

Suryakumar Yadav: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్‌లో విఫలమైంది. సూర్య కుమార్ యాదవ్ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేకపోయారు.

Kangana Ranaut: కంగనా బీజేపీలోకి రావొచ్చు.. కానీ షరతులివే: జేపీ నద్దా

దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ 40 బంతుల్లో 68 పరుగులు చేసి, ఇండియా గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా మొదటి నుంచే వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. మొదట ఓపెనర్ రోహిత్ శర్మ 14 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటవ్వగా, ఆ తర్వాత కేఎల్ రాహుల్ 14 బంతుల్లో 9 పరుగులే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. కోహ్లీ 11 బంతుల్లో 12 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే, సూర్య కుమార్ యాదవ్ మాత్రం వికెట్ చేజార్చుకోకుండా, ధాటిగా ఆడాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా తన హవా కొనసాగించాడు.

Maharashtra: లిజ్ ట్రస్‌ను ఆదర్శంగా తీసుకుని ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేయాలి.. ‘మహా’ ప్రతిపక్ష నేతల డిమాండ్

68 పరుగులు చేసిన సూర్య కుమార్ యాదవ్ పర్నెల్ బౌలింగ్‌లో మహారాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీపక్ హుడా మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. దినేష్ కార్తీక్ 6 పరుగులు, హార్ధిక్ పాండ్యా 2 పరుగులు, రవి చంద్రన్ అశ్విన్ 7 పరుగులు చేసి ఔటవ్వగా, మహ్మద్ షమీ పరుగులేమీ చేయకుండానే రనౌట్‌తో వెనుదిరిగాడు. అర్షదీప్ సింగ్ 2 పరుగులతో, భువనేశ్వర్ కుమార్ 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. మొత్తం 20 ఓవర్లలో టీమిండియా 9 వికెట్లు కోల్పోయి, 133 పరుగులు సాధించింది. దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో లుంగి ఎంగిడి నాలుగు వికెట్లు తీయగా, పర్నెల్ మూడు వికెట్లు తీశారు. దక్షిణాఫ్రికా 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి రెండు వికెట్లు కోల్పోయింది.