T20 World Cup 2022: ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లు వీరే.. టాప్-5లో కోహ్లీ

ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల పేర్లను ఐసీసీ వెల్లడించింది. ఈ రేసులో టీమిండియా బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ కూడా చేరాడని తెలిపింది. 176 పరుగులతో కె.మెండిస్ (శ్రీలంక) అగ్రస్థానంలో ఉండగా, మాక్స్ ఓ'డౌడ్ (నెదర్లాండ్స్) 153 పరుగులతో రెండో స్థానంలో, ఎస్.రజా (జింబాబ్వే) 145 పరుగులతో మూడో స్థానంలో, విరాట్ కోహ్లీ (భారత్) 144 పరుగులతో నాలుగో స్థానంలో, పి.నిస్సాంక (శ్రీలంక) 137 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నారు.

T20 World Cup 2022: ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లు వీరే.. టాప్-5లో కోహ్లీ

Cine Celebrities Tweets on Kohli

T20 World Cup 2022: ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల పేర్లను ఐసీసీ వెల్లడించింది. ఈ రేసులో టీమిండియా బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ కూడా చేరాడని తెలిపింది. 176 పరుగులతో కె.మెండిస్ (శ్రీలంక) అగ్రస్థానంలో ఉండగా, మాక్స్ ఓ’డౌడ్ (నెదర్లాండ్స్) 153 పరుగులతో రెండో స్థానంలో, ఎస్.రజా (జింబాబ్వే) 145 పరుగులతో మూడో స్థానంలో, విరాట్ కోహ్లీ (భారత్) 144 పరుగులతో నాలుగో స్థానంలో, పి.నిస్సాంక (శ్రీలంక) 137 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నారు.

ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా పి.స్టిర్లింగ్ (122), జి.మున్సెయ్ (121), ఎల్.టకర్ (120), సి.క్యాంఫెర్ (119), ఎ.బాల్బిర్ని (117) ఉన్నారు. ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు రొస్సొ ఓ మ్యాచులో 109 పరుగులు చేశాడు. అలాగే, ఈ ప్రపంచ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా శ్రీలంక ఆటగాడు హసరంగా కొనసాగుతున్నాడు. అతడు ఇప్పటివరకు తొమ్మిది వికెట్లు తీశాడు. ఈ నెల 16 నుంచి టీ20 ప్రపంచ కప్‌ ప్రారంభమైంది. ఇప్పటివరకు రెండు మ్యాచులు ఆడిన టీమిండియా ఆ రెండింటిలోనూ గెలిచింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..