IPL Team: ఐపీఎల్ వేలానికి ముందు టీమ్‌లు రీటైన్ చేసుకునే ప్లేయర్లు ఎవరంటే?

రిచ్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2022వ సీజన్‌కు సంబంధించి జనవరిలో వేలం నిర్వహించనున్నారు.

10TV Telugu News

IPL Team: రిచ్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2022వ సీజన్‌కు సంబంధించి జనవరిలో వేలం నిర్వహించనున్నారు. ఈ IPL 2022 మెగా వేలంలో భారతదేశం నుంచి మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. ఇదిలా ఉంటే, ఏఏ జట్లు ఎవరిని రీటైన్ చేసుకోబోతున్నాయి అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఏ ఆటగాడిని రిటైన్ చేసుకోబోమని పంజాబ్ సూపర్ కింగ్స్ జట్టు అనధికారిక ప్రకటన ఇచ్చింది.

అయితే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుండి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా, రుత్ రాజ్ గైక్వాడ్‌లలో ఒకరిని రిటైన్ చేసుకోనున్నట్లుగా తెలుస్తుంది. మొయిన్ అలీ లేదా ఫాఫ్ డుప్లెసిస్‌లలో ఒకరిని కూడా రీటైన్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ, ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాని రిటైన్ చేసుకునే అవకాశం ఉండగా.. పోలార్డ్‌ని కూడా రీటైన్ చేసుకోవచ్చు అని అంటున్నారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు నుండి విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్ వెల్‌ని రిటైన్ చేసుకోవచ్చునని తెలుస్తుంది. సన్ రైసర్స్ హైదరాబాద్ కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్‌ని రిటైన్ చేసుకోవచ్చునని అంటున్నారు. కలకత్తా నైట్ రైడర్స్ రస్సెల్‌ని రిటైన్ చేసుకునే అవకాశం ఉండగా.. సుబ్మాన్ గిల్, వెంకటేష్ అయ్యర్‌లలో ఒకరిని, వరుణ్ చక్రవర్తిని రీటైన్ చేసుకోవచ్చునని అంటున్నారు. రాజస్తాన్ రాయల్స్ సంజు శాంసన్‌ని, ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్, పృద్వీ షా, నోర్త్జేలని రిటైన్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

రూల్స్ ప్రకారం.. వేలానికి ముందు నలుగురు ప్లేయర్లను ఫ్రాంచైజీ ఉంచుకోవచ్చు. అయితే, అందులో ఇద్దరు ఇండియన్ ప్లేయర్లు.. ఇద్దరు విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఉండాలి. ప్లేయర్లను జట్టులో ఉంచుకోవడం కూడా వారికి చెల్లించే డబ్బు ఆధారంగానే ఉంటుంది.

* నలుగురు ప్లేయర్లను తీసుకోవాలనుకుంటే.. మొత్తంగా రూ.42కోట్లు (రూ.16కోట్లు, రూ.12కోట్లు, రూ.8కోట్లు, రూ.6కోట్లు)
* ముగ్గురు ప్లేయర్లను తీసుకోవాలనుకుంటే.. మొత్తంగా 33 రూ.33కోట్లు (రూ.15కోట్లు, రూ.11కోట్లు, రూ.7కోట్లు)
* ఇద్దరు ప్లేయర్లను తీసుకోవాలనుకుంటే.. మొత్తంగా రూ.22 కోట్లు (రూ.14కోట్లు, రూ.10కోట్లు)
* ఒక్కరిని మాత్రమే తీసుకోవాలనుకుంటే.. మొత్తంగా రూ.14కోట్లు (అన్ క్యాప్‌డ్ ప్లేయర్ అయితే రూ.4కోట్లు)

గతంలో పర్స్ వాల్యూ రూ.85కోట్లు ఉండగా దానిని రూ.5కోట్లు పెంచి రూ.90కోట్లకు చేసింది బీసీసీఐ. రాబోయే సీజన్లకు కచ్చితంగా ఫ్రాంచైజీల అకౌంట్ల నుంచే ప్లేయర్ల జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి.

ఒక్కో ఫ్రాంచైజీ దగ్గర ఉండే మొత్తం:
* రిటెన్షన్ లేకపోతే.. రూ.90కోట్లు
* ఒక రిటెన్షన్ ఉంటే.. రూ.76కోట్లు
* రెండు రిటెన్షన్లు ఉంటే.. రూ.66కోట్లు
* మూడు రిటెన్షన్లు ఉంటే.. రూ.57కోట్లు
* నాలుగు రిటెన్షన్లు ఉంటే.. రూ.48కోట్లు

×