T20 World Cup 2022 Final: 30ఏళ్ల చరిత్రను పాక్ పునరావృతం చేస్తుందా? గణాంకాలు చూస్తే ఇంగ్లాండ్‌దే పైచేయి ..

పాకిస్థాన్ జట్టు 1992నాటి విజయాన్ని మరోసారి పునరావృతం చేస్తుందని పాక్ మాజీ ఆటగాళ్లు, అభిమానులు బలంగా నమ్ముతున్నారు. 30 ఏళ్ల క్రితం కూడా పాకిస్థాన్‌ ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించే దశలోనే ఉన్నా అదృష్టంతో ఫైనల్‌కు చేరుకొని మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టుపై విజేతగా నిలిచింది. అప్పుడు ఫైనల్ మ్యాచ్ కూడా ఆస్ట్రేలిలోని మెల్‌బోర్న్‌లోనే కావడం విశేషం.

T20 World Cup 2022 Final: 30ఏళ్ల చరిత్రను పాక్ పునరావృతం చేస్తుందా? గణాంకాలు చూస్తే ఇంగ్లాండ్‌దే పైచేయి ..

T20 World Cup 2022 Final

T20 World Cup 2022 Final: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఫైనల్ మ్యాచ్ రేపు (ఆదివారం) జరగనుంది. సెమీస్‌లో న్యూజీలాండ్ జట్టును ఓడించి పాక్ ఫైనల్‌కు చేరగా.. ఇండియాను ఓడించి ఇంగ్లాండ్ ఫైనల్‌కు చేరి పాక్‌తో అమితుమీకి సిద్ధమైంది. రేపు మెల్ బోర్న్‌ క్రికెట్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ లో తలపడే పాక్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్లు సమఉజ్జీలుగా ఉన్నాయి. ఇరు జట్లలో మ్యాచ్ ను మలుపుతిప్పగలిగే బ్యాటర్లు, బౌలర్లు ఉన్నారు. అయితే, చరిత్రను చూస్తే పాక్ కు విజయావకాశాలు ఎక్కువగా ఉండగా, ఇరుజట్ల మధ్య గణాంకాలు చూస్తే ఇంగ్లాండ్ విజేతగా చెబుతున్నాయి.

T20 World Cup 2022: ఇంగ్లాండ్ చేతిలో టీమ్ ఇండియా ఘోర ఓటమి.. నెట్టింట్లో పేలుతున్న జోకులే జోకులు ..

పాకిస్థాన్ జట్టు 1992 లాంటి విజయాన్ని మరోసారి పునరావృతం చేస్తుందని పాక్అ భిమానులు పేర్కొంటున్నారు. 30 ఏళ్ల క్రితం కూడా పాకిస్థాన్‌ ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించే దశలోనే ఉన్నా అదృష్టంతో ఫైనల్‌కు చేరుకున్న పాక్ జట్టు.. ఫైనల్ మ్యాచ్ లో విజేతగా నిలిచింది. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్‌లోకూడా బాబర్ జట్టు తొలుత ఇంటికి వెళ్లే దశనుంచి పుంజుకొని ఫైనల్‌కు వచ్చింది. ఈ క్రమంలో పాక్ 1992 వరల్డ్ కప్ ఫలితాన్ని పునరావృతం చేస్తుందనే నమ్మకంతో పాక్ మాజీ ఆటగాళ్లు, పాక్ అభిమానులు భావిస్తున్నారు.

T20 World Cup: టీమ్‌లో ఒక్కరే లీడర్ ఉండాలి.. ఏడుగురు కాదు.. రోహిత్ కెప్టెన్సీ‌పై అజయ్ జడేజా కీలక వ్యాఖ్యలు..

ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. 1992 వరల్డ్ కప్ కూడా ఆస్ట్రేలియాలో జరిగింది. అందులో ఫైనల్ మ్యాచ్ మెల్ బోర్న్ లోనే జరగగా ప్రస్తుతం టీ20లో కూడా ఫైనల్‌లో పాక్, ఇంగ్లాండ్ జట్లు మెల్ బోర్న్‌లోనే తలపడనున్నాయి. అటువంటి పరిస్థితిలో పాక్ గత చరిత్రను పునరావృతం చేస్తుందనే నమ్మకంతో ఆ దేశ అభిమానులు ఉన్నారు. గణాంకాలు మాత్రం ఇంగ్లండ్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్ల మధ్య ఇప్పటివరకు 28 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఇంగ్లండ్‌ 17 మ్యాచ్‌లు, పాకిస్థాన్‌ 9 మ్యాచ్‌లు గెలిచాయి. ఒక మ్యాచ్ నిలిచిపోగా, ఒక మ్యాచ్ టై అయింది. అంటే టీ20 మ్యాచుల్లో పాకిస్థాన్‌పై ఇంగ్లండ్‌ రికార్డ్ మెరుగ్గా ఉంది. ఇంగ్లండ్‌ ఇటీవల అదే గడ్డపై జరిగిన ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాకిస్థాన్‌ను ఓడించింది. 17ఏళ్ల తర్వాత, ఇంగ్లండ్ జట్టు సెప్టెంబర్ 2022లో పాకిస్థాన్ పర్యటనకు వచ్చింది. ఇక్కడ ఇంగ్లిష్ జట్టు 4-3 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.