5G network : వచ్చే ఆ రెండు నెలల్లోనే ఇండియాలో 5G నెట్‌వర్క్ ఎంట్రీ..!

5G Network : భారత్‌లో 5G స్పెక్ట్రమ్ వేలం జూలైలో జరుగనుంది. స్పెక్ట్రమ్ వేలం విజయవంతంగా ముగిసిన వెంటనే ఇండియాలో 5G నెట్ వర్క్ ప్రారంభమవుతుందని కేంద్ర టెలికాం ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

5G network : వచ్చే ఆ రెండు నెలల్లోనే ఇండియాలో 5G నెట్‌వర్క్ ఎంట్రీ..!

5g Network Rollout In India Will Happen In August September

5G Network : భారత్‌లో 5G స్పెక్ట్రమ్ వేలం జూలైలో జరుగనుంది. స్పెక్ట్రమ్ వేలం విజయవంతంగా ముగిసిన వెంటనే ఇండియాలో 5G నెట్ వర్క్ ప్రారంభమవుతుందని కేంద్ర టెలికాం ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో హైస్పీడ్ 5G సర్వీసులు అందుబాటులోకి వస్తాయని వైష్ణవ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ 5G స్పెక్ట్రమ్ వేలానికి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

జూలై 26న స్పెక్ట్రమ్ వేలం జరగనుందని, వేలం జులైలో జరుగనున్నా.. దానికి సంబంధించిన ప్రక్రియ మాత్రం ఇప్పటికే ప్రారంభమైందని వైష్ణవ్ తెలిపారు. మొత్తం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి టెలికాం కంపెనీలు ఇప్పటికే సమిష్టిగా పనిచేస్తున్నాయని వైష్ణవ్ చెప్పారు. జూలైలో వేలం జరగాల్సి ఉంది. ఆగస్ట్-సెప్టెంబర్ నెలల్లో 5G నెట్‌వర్క్ ప్రారంభించడానికి సరైన సమయమని ఆయన చెప్పారు. 5G నెట్‌వర్క్ ప్రారంభం ఆగస్టు 15న జరుగుతుందని వైష్ణవ్ ఖచ్చితమైన తేదీని నిర్ధారించలేదు.

5g Network Rollout In India Will Happen In August September (1)

5g Network Rollout In India Will Happen In August September 

5G నెట్ వర్క్ 4G కన్నా 10 రెట్లు వేగవంతమైనదిగా అంచనా. మిడ్ హై బ్యాండ్ స్పెక్ట్రమ్‌ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు 5G సాంకేతికత ఆధారిత సేవలను అందించడానికి 10 స్పీడ్ సామర్థ్యాలను అందించగలదని భావిస్తున్నారు. ప్రస్తుత 4G సర్వీసుల ద్వారా సాధ్యమయ్యే దానికంటే రెట్లు ఎక్కువగా ఉంటుందని అధికారిక PIB పేర్కొంది. 20 ఏళ్ల వ్యాలిడిటీతో 72097.85 MHz స్పెక్ట్రమ్‌ని జులై చివరి నాటికి వేలానికి ఉంచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

వీటిలో 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 3300 MHz 26 GHz ఉన్నాయి. మొదటి దశలో భాగంగా 13 ప్రధాన నగరాల్లో 5G సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ముంబై, బెంగళూరు, ఢిల్లీ, గురుగ్రామ్, కోల్‌కతా, లక్నో, పూణే, చెన్నై, గాంధీనగర్, హైదరాబాద్, జామ్‌నగర్, అహ్మదాబాద్, చండీగఢ్ ఉన్నాయి. మరిన్ని నగరాలు, గ్రామీణ ప్రాంతాలు చివరి జాబితాలో చేరనున్నాయి.

Read Also : 5G Smartphones : భారత్‌కు 5G నెట్‌వర్క్ వస్తోంది.. ఇంతకీ 5G స్మార్ట్ ఫోన్లు కొనాలా? వద్దా?