Apple Car: సెల్ఫ్ డ్రైవింగ్ కారుతో ఎంట్రీ ఇవ్వనున్న ‘యాపిల్’.. 2026లో తొలి కారు విడుదలకు సన్నాహాలు

ఐఫోన్లు, ఐపాడ్స్, మ్యాక్ బుక్స్ వంటి ఉత్పత్తులతో మార్కెట్లో దూసుకుపోతున్న యాపిల్ సంస్థ త్వరలో ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనుంది. అది కూడా సెల్ఫ డ్రైవింగ్ కారు.

Apple Car: సెల్ఫ్ డ్రైవింగ్ కారుతో ఎంట్రీ ఇవ్వనున్న ‘యాపిల్’.. 2026లో తొలి కారు విడుదలకు సన్నాహాలు

Apple Car: స్మార్ట్‌ఫోన్లల్లో టాప్ బ్రాండ్ ఏదీ అంటే అందరూ చెప్పేది ‘యాపిల్’ గురించే. యాపిల్ నుంచి వచ్చిన ఐఫోన్లు, ఐపాడ్స్, మ్యాక్ బుక్స్ వంటివి ఎంతగా ఆదరణ పొందుతున్నాయో తెలిసిందే. ఖరీదు ఎక్కువైనా వీటిని కొనేందుకు వినియోగదారులు వెనక్కి రావడం లేదు.

Lionel Messi: ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పనున్న మెస్సీ… ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌తో వీడ్కోలు చెప్పనున్న అర్జెంటినా దిగ్గజం

అంతగా వినియోగదారుల్లో గుర్తింపు తెచ్చుకున్న యాపిల్ త్వరలో కార్ల మార్కెట్లోకి ప్రవేశించబోతుంది. 2026లో యాపిల్ తొలి కారు మార్కెట్లోకి వస్తుంది. అది కూడా సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కారు. టైటాన్ ప్రాజెక్టు కింద ఈ కారును యాపిల్ సంస్థ 2014 నుంచి అభివృద్ధి చేస్తోంది. మొదట్లో ఈ కారును పూర్తి అటానమస్ డ్రైవింగ్ మోడ్‌లోనే రిలీజ్ చేయాలనుకుంది. అది కూడా స్టీరింగ్ వంటివి ఏవీ లేకుండానే విడుదల చేయాలనుకుంది. కానీ, తర్వాత తన ప్రణాళికలు మార్చుకుంది. సెల్ఫ్ డ్రైవింగ్ కారును రూపొందిస్తున్నప్పటికీ, అది పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ కాదు. హైవేల మీద మాత్రమే స్వతంత్రంగా డ్రైవ్ చేయగలదు. మిగతా చోట్ల డ్రైవర్లే నడపాల్సి ఉంటుంది. ఈ కారు మార్కెట్లోకి వస్తే టెస్లాకు గట్టి పోటీ ఇస్తుందని యాపిల్ కంపెనీ భావిస్తోంది. అలాగే ఎలక్ట్రిక్ కార్లు తీసుకొచ్చిన మెర్సిడెస్, జీఎం వంటి సంస్థలకు కూడా పోటీగా నిలవనుంది.

Viral video: వారెవ్వా.. కోతి తెలివి.. జింకల ఆకలి తీర్చేందుకు కోతి ఏం చేసిందో చూడండి

ముందుగానే ఈ కారును మార్కెట్లోకి తేవాలనుకున్నప్పటికీ సాధ్యపడటం లేదు. అందుకే 2026లోనే కారు మార్కెట్లోకి వస్తుంది. ఇక కారు ధర విషయానికొస్తే ఈ సెగ్మెంట్‌లోని ఇతర కార్లకంటే తక్కువ ధరకే అందుబాటులోకి తేవాలనుకుంటోంది. దాదాపు లక్ష డాలర్లకు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.81 లక్షలకు ఈ కారు మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది.