Mobile Calling New Rule : మొబైల్ యూజర్లకు బిగ్ రిలీఫ్.. మే 1 నుంచి ట్రాయ్ కొత్త రూల్స్.. ఇకపై ఫేక్ ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు చెక్ పడినట్టే..!

Mobile Calling New Rule : మొబైల్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. మే 1 నుంచి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కొత్త రూల్స్ ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త నిబంధనలతో ఫేక్ ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు చెక్ పెట్టనుంది.

Mobile Calling New Rule : మొబైల్ యూజర్లకు బిగ్ రిలీఫ్.. మే 1 నుంచి ట్రాయ్ కొత్త రూల్స్.. ఇకపై ఫేక్ ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు చెక్ పడినట్టే..!

Mobile Calling New Rule _ Major relief for mobile users, Fake calls and SMS will be curbed from May 1

Mobile Calling New Rule : మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మే 1, 2023 (సోమవారం) నుంచి మొబైల్ కాలింగ్‌పై కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిబంధనలను మార్చాలని నిర్ణయించింది. కొత్త నిబంధనల ప్రకారం.. (TRAI) మే 1 నుంచి ఫోన్‌ల నుంచి ఫేక్ కాల్స్, SMSలను బ్లాక్ చేసే ఫిల్టర్‌ను సెటప్ చేస్తోంది. తద్వారా మొబైల్ యూజర్లకు బిగ్ రిలీఫ్ కలగునుంది. ఈ కొత్త రూల్స్ ప్రకటనతో వినియోగదారులకు గుర్తుతెలియని ఫోన్ కాల్‌లు, మెసేజ్‌ల బెడద తప్పనుంది. ట్రాయ్ ప్రకటించిన కొత్త నిబంధనలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

ట్రాయ్ కొత్త రూల్స్ మే 1 నుంచి అమల్లోకి :
మొబైల్ యూజర్లు ఎప్పటినుంచో ఈ ఫేక్ ఫోన్ కాల్స్, మెసేజ్‌లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు టెలికాం కంపెనీలకు ఫోన్ కాల్, మెసేజ్ సర్వీసుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI Spam) స్పామ్ ఫిల్టర్‌లను ఇన్‌స్టాల్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త ఫీల్టర్ ఫీచర్ ద్వారా ఫేక్ కాల్స్, మెసేజ్‌ల నుంచి వినియోగదారులను ప్రొటెక్ట్ చేసేందుకు సాయపడుతుంది. ఈ కొత్త రూల్ ప్రకారం.. యూజర్లకు వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు సంబంధించిన అన్ని టెలికాం కంపెనీలు మే 1, 2023లోపు ఫిల్టర్‌లను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది.

Read Also : Apple iPhone 13 Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. క్రేజీ డీల్ ఎప్పటినుంచంటే?

త్వరలో జియోలో AI ఫిల్టర్ ఫీచర్ :
ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన ఎయిర్‌టెల్ (Airtel) ఇప్పటికే ఇలాంటి AI ఫిల్టర్‌ల సౌకర్యాన్ని ప్రకటించింది. ట్రాయ్ కొత్త రూల్ ప్రకారం.. జియో తన సర్వీసుల్లో AI ఫిల్టర్‌లను ఇన్‌స్టాల్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతానికి జియో నుంచి ఎలాంటి సమాచారం లేదు. అయితే భారత టెలికం మార్కెట్లో AI ఫిల్టర్‌ల వినియోగం మే 1, 2023 నుంచి ప్రారంభమవుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Mobile Calling New Rule _ Major relief for mobile users, Fake calls and SMS will be curbed from May 1

Mobile Calling New Rule _ Major relief for mobile users, Fake calls and SMS will be curbed from May 1

ప్రమోషనల్ కాల్స్‌పై నిషేధం.. త్వరలో కాల్ ఐడీ ఫీచర్ :
ఫేక్ కాల్స్, మెసేజ్‌లను అరికట్టడానికి TRAI కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొస్తోంది. బోగస్ కాల్స్, టెక్స్ట్‌లను అరికట్టేందుకు ట్రాయ్ ఈ సరికొత్త వ్యూహాన్ని అభివృద్ధి చేసింది. దీని ప్రకారం.. 10 అంకెల మొబైల్ నంబర్లలో చేసే ప్రమోషనల్ కాల్‌లను నిలిపివేయాలని TRAI డిమాండ్ చేసింది. ఫలితంగా మొబైల్ నంబర్ల నుంచి ప్రమోషన్ల కోసం చేసిన కాల్‌లను బ్లాక్ చేయాలని ట్రాయ్ టెల్కోలను కోరింది. అంతేకాదు.. (TRAI Caller ID) ఫీచర్‌ను కూడా తీసుకువచ్చింది. ఇందులో కాలర్ నేమ్ (Caller Name), ఫొటో (Profile Photo) డిస్‌ప్లే అవుతుంది.

టెలికాం కంపెనీల్లో ఎయిర్‌టెల్, జియో కూడా ట్రూకాలర్ యాప్‌ (TrueCaller)తో చర్చలు జరుపుతున్నాయి. అయితే, కాలర్ ఐడి ఫీచర్‌ను ఎనేబుల్ చేయడం ద్వారా యూజర్లు ప్రైవసీ సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈ విషయంలో టెలికం కంపెనీలు ప్రైవసీ సమస్య కారణంగా ఈ టెక్నాలజీని తీసుకురావడానికి వెనుకాడుతున్నాయి. అయితే, దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. మొబైల్ యూజర్లను వేధించే ఫేక్ కాల్‌లు, SMSలను బ్లాక్ చేయడానికి మాత్రమే AI ఫిల్టర్ అమలు చేయనున్నట్టు ఓ నివేదిక తెలిపింది.

Read Also : Top 5 Upcoming SUVs : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? రాబోయే టాప్ 5 SUV కార్లు ఇవే.. ఏ మోడల్ ధర ఎంత ఉండొచ్చుంటే?