ఐడియా సిగ్నల్ డౌన్ : ఆగ్రహంలో కస్టమర్లు

  • Published By: sreehari ,Published On : September 27, 2019 / 07:39 AM IST
ఐడియా సిగ్నల్ డౌన్ : ఆగ్రహంలో కస్టమర్లు

మీది ఐడియా సిమ్ కార్డా.. ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ సర్వీసులు వాడుతున్నారా.. అయితే మీ ఫోన్ పని చేయటం లేదు.. ఆందోళన పడొద్దు.. సెల్ ఫోన్లు పగలగొట్టుకోవద్దు.. దేశవ్యాప్తంగా ఐడియా సర్వీస్ డౌన్ అయ్యింది. కోట్లాది మంది కస్టమర్లు ఫోన్లకు ఏమైందనే ఆందోళనకు గురవుతున్నారు. 

హైదరాబాద్, పూణె, ముంబై, ఢిల్లీ, లక్నో, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, ఎర్రాకుళం ప్రాంతాల్లో ఐడియా ప్రీ పెయిడ్ సర్వీస్ డౌన్ అయ్యింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ పెడుతున్నారు. ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ వెళ్లటం లేదు. సిగ్నల్స్ డౌన్ అయినట్లు చూపిస్తోంది. ఐడియాలో 60శాతం నెట్ వర్క్ డౌన్ అయినట్లు సమాచారం. ఐడియా ఇంటర్నెట్ లో 10శాతం ఎఫెక్ట్ అయినట్లు టెక్ గురూ చెబుతున్నారు.

హైదరాబాద్ లో సెప్టెంబర్ 27వ తేదీ ఉదయం 11 గంటల నుంచి ఈ సమస్య తలెత్తింది. ముంబై, పూణెలో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ సమస్య తలెత్తింది. సిగ్నల్స్ రాకపోవటంతో చాలా మంది రీ స్టార్ట్ చేయటం, నెట్ వర్క్ రీ సెట్ చేసుకున్నారు కస్టమర్లు. అయినా ఫలితం లేకపోవటంతో ఇబ్బంది పడుతున్నారు. కాల్ సెంటర్ కు ఫోన్ చేసినా కనెక్ట్ కాకపోవటంతో కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఐడియా నెట్ వర్క్ సిగ్నల్స్ డౌన్ కావడం వరుసగా ఇది నాల్గోసారి. జూన్ 20న ఒకసారి, ఆగస్టు 11న రెండోసారి, సెప్టెంబర్ 17న మూడోసారి ఐడియా నెట్ వర్క్ నిలిచిపోయింది. ఐడియా సిగ్నిల్స్ ఒక్కసారిగా డౌన్ కావడంతో కస్టమర్లంతా గందరగోళంలో ఉన్నారు. ఐడియా ప్రీపెయిడ్ మాత్రమే కాదు.. పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు కూడా నెట్ వర్క్ నిలిచిపోయింది. మధ్యాహ్నం నుంచి సిగ్నల్స్ నిలిచిపోవడంతో పోస్ట్ పెయిడ్ కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. 

Idea network problems