Khammam: డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి యువతి మృతి.. తెలంగాణలో నెలరోజుల్లో ఇలాంటి ఘటనలు 5

ఫిబ్రవరి 20 నుంచి ఇప్పటివరకు మొత్తం 5 ఘటనలు ఇటువంటివే వెలుగులోకి వచ్చాయి. పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ, జిమ్ లో వ్యాయామం చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు.

Khammam: డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి యువతి మృతి.. తెలంగాణలో నెలరోజుల్లో ఇలాంటి ఘటనలు 5

DEAD

Khammam: అప్పటివరకు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు కనపడుతున్నారు.. ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు.. యువత అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా, ఖమ్మం జిల్లాలోనూ ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. రాణి (30) అనే మహిళ చింతకాకాని మండలం సీతంపేట గ్రామంలో ఓ వివాహ వేడుకకు వెళ్లింది. అక్కడ బంధువులతో కలిసి డ్యాన్స్ చేసింది.

అనంతరం పెళ్లికూతురి అప్పగింతల సమయంలో ఉన్నట్టుండి రాణి కుప్పకూలిపడిపోయింది. దీంతో వెంటనే ఆమెను బంధువులు ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. తెలంగాణలో ఇటువంటి ఘటనలు ఇప్పటికి 5 చోటుచేసుకున్నాయి. మృతులు అందరూ 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారే.

అకస్మాత్తుగా కార్డియార్ అరెస్టుతో వారు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ లోని కాలాపత్తర్ లో ఫిబ్రవరి 20న పెళ్లికొడుకు హాల్దీ రాస్తూ ఓ వ్యక్తి మృతి చెందారు. ఫిబ్రవరి 23న జిమ్ లో వ్యాయామం చేస్తూ 24 ఏళ్ల ఓ పోలీసు కోల్పోయారు. ఫిబ్రవరి 27న 19న పార్దీలో 19 ఏళ్ల కుర్రాడు పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ మృతి చెందాడు. హైదరాబాద్ లో మార్చి 1న బ్యాడ్మింటన్ ఆడుతూ 38 ఏళ్ల ఓ వ్యక్తి మృతి చెందారు. మార్చి 4న కాలేజీలో ఓ 18 ఏళ్ల విద్యార్థి కుప్పకూలి మరణించాడు.

Wanaparthy: తల్లిని చంపి సంపులో పడేసిన కొడుకు, అతడి భార్య.. నిందితులపై గ్రామస్థుల దాడి