ఆవు కడుపులో 80కిలోల ప్లాస్టిక్ వ్యర్ధాలు..ఆపరేషన్ చేసి తొలగించిన డాక్టర్

  • Published By: nagamani ,Published On : October 31, 2020 / 04:49 PM IST
ఆవు కడుపులో 80కిలోల ప్లాస్టిక్ వ్యర్ధాలు..ఆపరేషన్ చేసి తొలగించిన డాక్టర్

Telangana : ప్లాస్టిక్ వాడకం మూగ జీవాల పాలిట ప్రాణసంకటంగా మారుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగం పశువులకు ప్రాణాంతకంగా మారింది. విచక్షణ మరచిన మనుషులు ఇష్టమొచ్చిన్నట్లుగా వాడి పారేస్తున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు తిన్న జంతువులు ప్రాణాలతో పోరాడుతున్న దుస్థితి నెలకొంది. ప్లాస్టిక్ వ్యర్ధాలను తిన్న ఓ ఆవు పరిస్థితి హృదయ విదారకంగా మారింది.


అనారోగ్యం పాలవ్వటంతో ఆ ఆవు ఆహారం తినకుండా కనీసం నీళ్లు కూడా తినలేని పరిస్థితికి చేరుకుంది. దీంతో ఆ ఆవును పశువుల డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లగా దానికి స్కానింగ్ చేసిన చేసిన డాక్టర్లు కడుపులో ఏకంగా ప్లాస్టిక్ వ్యర్ధాలు పేరుకుపోయాయని అందుకే ఆవు అనారోగ్యం పాలైందని తెలిపారు. దీంతో ఆవుకు ఆపరేషన్ చేయగా కడుపులోంచి ఏకంగా 80 కిలోల ప్లాస్టిక్ వ్యర్ధాలను వెలికి తీశారు.


వివరాల్లోకి వెళితే..మెదక్ జిల్లా, పటాన్ చెరులోఓ ఆవుకు పశువుల డాక్టర్లు ఆపరేషన్‌ చేశారు. అమీన్‌పూర్‌ గోశాలకు తరలించారు. దాదాపు 6 నుంచి 8 గంటలపాటు శ్రమించి 80 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఆపరేషన్ చేసి తొలగించారు. వీధుల్లో సంచరించే ఆ ఆవు ప్లాస్టిక్ వ్యర్ధాలను తినటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని..దయచేసి ప్లాస్టిక్ వ్యర్ధాలను అలా ఎక్కడపడితే అక్కడ పారవేయవద్దనీ…అలా చేస్తే వాటిని తిన్న మూగజీవాలను ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని పశువైద్యులు చూసించారు.


కాగా..అనారోగ్యంతో ఉన్న 2 ఆవులను జీహెచ్‌ఎంసీ సిబ్బంది 20 రోజుల క్రితం అమీన్‌పూర్‌ లోని శ్రీ మల్లిఖార్జున భ్రమరాంబ గోశాలకు తరలించారు. కడుపు ఉబ్బరంతో బాధపడుతూ, ఆహారం తీసుకోక అనారోగ్యం పాలయ్యాయి. వాటిలో ఒక ఆవు మూడ్రోజుల క్రితం మృతి చెందగా .. మరో ఆవు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది.



దీంతో అమీన్‌పూర్‌ పశువైద్యాధికారి విశ్వచైతన్య ఆ ఆవుకు ఆపరేషన్ చేసి దాని పొట్టలో పేరుకుపోయిన 80 కిలోల ప్లాస్టిక్, కాటన్‌ బట్టలు బయటకు తీశారు. ప్రస్తుస్తుతం ఆవు ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తెలిపారు.