Hyderabad Crime : స్నేహితుడి భార్యపై అఘాయిత్యం.. వీడియోలు తీసి వెకిలి చేష్టలు
స్నేహితుడి భార్యపై కన్నేసిన వ్యక్తి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. ఆ దృశ్యాలను తన ఫోన్ లో బందించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

Hyderabad Crime
Hyderabad Crime : పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. గాజుల రామారంలోని నెహ్రూ నగర్‌కు చెందిన ప్రశాంత్ జీడిమెట్ల భాగ్యలక్ష్మీ కాలనీలో ఉంటున్న స్నేహితుడి ఇంటికి తరచూ వెళ్తుండేవాడు. ఇదే సమయంలో స్నేహితుడి భార్యను పరిచయం చేసుకున్నాడు. తనను ప్రేమించాలని లేదంటే సూసైడ్ చేసుకుంటానని సదరు మహిళను బెదిరించాడు.
చదవండి : Cyber Crimes : హైదరాబాద్‌లో పెరుగుతున్న సైబర్ నేరాలు
ఆమెను భయపెట్టి బెదిరించి పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.. అంతటితో ఆగకుండా లైంగిక దాడిని తన ఫోన్ లో చిత్రీకరించాడు. ఇక ఆ వీడియోలతో బెదిరించి అనేక సార్లు ఆమెపై లాంగిక దాడి చేశాడు. ఆ తర్వాత డబ్బులు గుంజడం ప్రారంభించాడు. వీడియోలు బయటపెడతానని, భర్తను, పిల్లలను చంపేస్తానని చెప్పి పలు దఫాలుగా ఆమె నుంచి రూ.16 లక్షలు వసూలు చేశారు.
చదవండి : Cyber Crime : రూపాయితో రీఛార్జి అన్నాడు..రూ.11 లక్షలు కాజేశాడు
అయినా ప్రశాంత్ వేధించడం ఆపలేదు. అతడి వేధింపులు తాళలేని మహిళ పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నీచుడు ప్రశాంత్ ని అదుపులోకి తీసుకోని విచారణ ప్రారంభించారు.