Kendriya Vidyalayas : కేంద్రీయ విద్యాలయాల్లో 2-10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం

కేంద్రీయ విద్యాలయ సంఘటన్ 2020-21 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల షెడ్యూల్‌ను ప్రకటించింది. కేంద్రీయ విద్యాలయాల్లో 2నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.

Kendriya Vidyalayas : కేంద్రీయ విద్యాలయాల్లో 2-10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం

Kvs Admissions

Kendriya Vidyalayas Admissions : కేంద్రీయ విద్యాలయ సంఘటన్ 2020-21 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల షెడ్యూల్‌ను ప్రకటించింది. కేంద్రీయ విద్యాలయాల్లో 2నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 2వ తరగతి నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు గురువారం (ఏప్రిల్ 8, 2021) నుంచి ఏప్రిల్ 15, 2021 వరకు జరుగనున్నాయి. ఇందు కోసం అడ్మిషన్స్ మొదలయ్యాయి. ఈ అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అధికారిక వెబ్‌సైట్ లో kvsonlineadmission.kvs.gov.in. చూడవచ్చని తెలిపింది.

అధికారిక సమాచారం కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ఈ వెబ్‌సైట్ ను మాత్రమే ఫాలో కావాలి. అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. kvsonlineadmission.kvs.gov.in . వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లో కూడా దరఖాస్తు చేయొచ్చు. 1వ తరగతిలో అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2021 ఏప్రిల్ 1న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.

కేంద్రీయ విద్యాలయ సంఘటన్ మరో కీలక ప్రకటన విడుదల చేసింది. గురువారం(ఏప్రిల్ 8, 2021) అధికారిక నోటిఫికేషన్‌లో ఈ వివరాలను తెలిపింది. కేవీఎస్ 2వ తరగతి ప్రవేశ ప్రక్రియ 2021 ఆఫ్‌లైన్ మోడ్‌లో జరుగుతోంది. అంటే, తల్లిదండ్రులు/సంరక్షకులు సంబంధిత కేంద్రీయ విద్యాలయానికి వెళ్లి అప్లై చేసుకోవాలని కోరింది.

స్కూల్‌కు వెళ్లి దరఖాస్తు ఫారమ్ పొందాలని కోరింది. దేశ వ్యాప్తంగా ఉన్న కేవీ నిర్దిష్ట తరగతిలో అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్య ఆధారంగా రెండవ తరగతి ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ల జరుగుతున్నాయని వెల్లడించింది. 2 వ తరగతిలో చేరిన విద్యార్థుల జాబితాను 2021 ఏప్రిల్ 19 న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంతో తల్లిదండ్రులు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ప్రవేశం 2021 ముఖ్యమైన తేదీలను ట్రాక్ చేయడం చాలా ముఖ్యం. అలా చేయడంలో వారికి సహాయపడటానికి, వివరణాత్మక పట్టిక అన్ని ముఖ్యమైన ప్రవేశ సంఘటనలు మరియు వాటి తేదీలను తెలియజేస్తుంది.

Admission Event Date / Deadline
Registrations Begin 8th April 2021
Registrations End 15th April 2021
Admission Process Begins 20th April 2021
Admission Process Ends 27th April 2021