Yadadri Waterfall : యాదాద్రి గుట్ట‌పై అద్భుత జ‌ల‌పాతం

యాదాద్రి పుణ్యక్షేత్రం సర్వాంగసుందరంగా ముస్తాబవుతోంది. దేవాలయం చుట్టూ ప్రకృతి వానలు, పూల మొక్కలను నాటుతున్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా గుడి చుట్టూ ముస్తాబు చేస్తున్నారు. దేవాలయ ప్రాంగణంలోని కొండపై కృత్రిమ జలపాతం ఏర్పాటు చేశారు అధికారులు. ఇది ఆచం ప్రకృతి సిద్దంగా ఏర్పడిన జలపాతం లాగానే కనిపిస్తుంది.

Yadadri Waterfall : యాదాద్రి గుట్ట‌పై అద్భుత జ‌ల‌పాతం

Yadadri Waterfall

Yadadri Waterfall : యాదాద్రి పుణ్యక్షేత్రం సర్వాంగసుందరంగా ముస్తాబవుతోంది. దేవాలయం చుట్టూ ప్రకృతి వానలు, పూల మొక్కలను నాటుతున్నారు. పర్యాటకులను కూడా ఆకర్షించే విధంగా గుడి చుట్టూ ముస్తాబు చేస్తున్నారు. దేవాలయ ప్రాంగణంలోని కొండపై కృత్రిమ జలపాతం ఏర్పాటు చేశారు అధికారులు. ఇది ఆచం ప్రకృతి సిద్దంగా ఏర్పడిన జలపాతం లాగానే కనిపిస్తుంది.

మొదటి ఘాట్‌ రోడ్డు వెంట ఉన్న రాతి గుట్టలపై ఈ జలపాతాన్ని సృష్టించారు. గుట్టపై నుంచి జాలువారుతున్న దృశ్యం భక్తులకు ఆహ్లాదాన్నిస్తుందని వైటీడీఏ అధికారులు తెలిపారు. మరోవైపు ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇక ఇప్పటికే యాదాద్రి చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి.

రియల్ వ్యాపారం జోరుగా సాగుతుంది. భువనగిరి – యాదాద్రి రోడ్డుకు ఇరువైపుల పూలమొక్కలు నాటారు. ఇవి చూపరులకు కనువిందు చేస్తున్నాయి.