Ask KTR : యూపీలో గెలుపు అవకాశాలు ఆ పార్టీకే ఎక్కువ, మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

బీజేపీ.. కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చినా దేశ ప్రజలకు చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. అందుకే ప్రజలకు ఏం చెప్పాలో తెలియక మత అజెండాతో వెళ్తోందన్నారు.

10TV Telugu News

Ask KTR : ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ నిర్వహించిన ఆస్క్ కేటీఆర్(#AskKTR) కార్యక్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేటీఆర్ అన్నారు. ఉత్తరప్రదేశ్ లో తాను ఎన్నికల ప్రచారం నిర్వహించడపై త్వరలోనే పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకుంటానని కేటీఆర్ చెప్పారు.

బీజేపీ.. కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చినా దేశ ప్రజలకు చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. అందుకే ప్రజలకు ఏం చెప్పాలో తెలియక మత అజెండాతో వెళ్తోందని విమర్శించారు. బీజేపీ విషపూరిత అజెండాను తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారని కేటీఆర్ అన్నారు. ఇక జాతీయ రాజకీయాలపై తనకు ఎలాంటి ఆసక్తి లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సేవ చేయడంలోనే సంతోషం ఉందన్నారు.

EPFO గుడ్‌న్యూస్.. గడువు పెంపు.. ఉద్యోగులకు బెనిఫిట్

రాష్ట్రంలో లాక్ డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ విధింపుపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. #askktr లో భాగంగా ఓ నెటిజన్ లాక్ డౌన్ గురించి ప్రశ్నించాడు. తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నందున రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తారా? లేక నైట్ కర్ఫ్యూ అమలు చేసే యోచనలో
ప్రభుత్వం ఏమైనా ఉందా? అని నెటిజన్ అడిగాడు. దానికి కేటీఆర్ స్పందించారు. కరోనా కేసుల సంఖ్య, వైద్యశాఖ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చే సలహాను బట్టి లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

కాగా, తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్నటితో(2,319) పోలిస్తే ఈ రోజులు కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 84వేల 280 శాంపిల్స్ పరీక్షించగా… 2,707 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,328 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 248, రంగారెడ్డి జిల్లాలో 202 కేసులు వెల్లడయ్యాయి.

Amazon Sale Offers : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. స్మార్ట్ ఫోన్లపై 40శాతం ఆఫర్.. 4 రోజులు మాత్రమే!

అదే సమయంలో మరో ఇద్దరు కరోనాతో మరణించారు. గడిచిన 24 గంటల్లో మరో 582 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,02,801 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,78,290 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 20వేల 462 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,049కి పెరిగింది.

×