Child marriage: పుట్టిన రోజు వేడుక పేరుతో 12ఏళ్ల బాలిక పెళ్లికి యత్నం.. చాకచక్యంగా తప్పించుకున్న.. |Attempt to marry a 12-year-old girl in the name of a birthday celebration

Child marriage: పుట్టిన రోజు వేడుక పేరుతో 12ఏళ్ల బాలిక పెళ్లికి యత్నం.. చాకచక్యంగా తప్పించుకున్న..

బాల్య వివాహాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నా.. కొందరిలో మార్పు రావటం లేదు. అభంశుభం తెలియని చిన్నారులకు పెండ్లి చేస్తూ వారి జీవితాలను ఆగం చేస్తున్నారు. బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా అధికారులు ప్రజల్లో

Child marriage: పుట్టిన రోజు వేడుక పేరుతో 12ఏళ్ల బాలిక పెళ్లికి యత్నం.. చాకచక్యంగా తప్పించుకున్న..

Child marriage: బాల్య వివాహాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నా.. కొందరిలో మార్పు రావటం లేదు. అభంశుభం తెలియని చిన్నారులకు పెండ్లి చేస్తూ వారి జీవితాలను ఆగం చేస్తున్నారు. బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా అధికారులు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. బాల్య వివాహాలు జరిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, జైలు శిక్ష తప్పదంటూ హెచ్చరిస్తున్న కొందరు గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహాలు జరిపించే ప్రయత్నం చేస్తున్నారు.

Child Killed : హైదరాబాద్ లో విషాదం..కారు ఢీకొని చిన్నారి మృతి

తాజాగా రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో 12ఏళ్ల చిన్నారికి బాల్య వివాహం చేసేందుకు తల్లిదండ్రులు యత్నించారు. పుట్టిన రోజు వేడుక పేరుతో 35ఏళ్ల వ్యక్తికి 12ఏళ్ల చిన్నారిని ఇచ్చి పెండ్లి చేసేందుకు పూనుకున్నారు. బాలిక విషయం తెలుసుకొని చాకచక్యంగా వ్యవహరించింది. పెళ్లి ఇష్టం లేదని చెప్పి బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. బంధువుల ఇంటికి వెళ్లిన చిన్నారి తల్లిదండ్రులు బాలికను పంపించాలని వాగ్వివాదంకు దిగారు.

Child Killed : హైదరాబాద్ లో విషాదం..కారు ఢీకొని చిన్నారి మృతి

విషయం ఐసీడీఎస్ అధికారులకు తెలియడంతో వారు ఘటన స్థలానికి చేరుకొని ఆరా తీశారు. బాల్య వివాహం అని నిర్ధారించుకొని విషయాన్ని కేశంపేట పోలీసులకు తెలియజేశారు. ఐసీడీఎస్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాలికను పెండ్లి చేసుకొనేందుకు సిద్ధమైన వ్యక్తి అక్కడి నుండి పరారయ్యాడు. కాగా బాలికను ఐసీడీఎస్ సిబ్బంది తమ వెంట తీసుకెళ్లినట్లు తెలిసింది.

×