పాతబస్తీలో బండి సంజయ్ బైక్ ర్యాలీ.. శుక్రవారం కావడంతో పోలీసుల్లో టెన్షన్..అరెస్టుకు రంగం సిద్ధం

  • Published By: bheemraj ,Published On : November 20, 2020 / 11:00 AM IST
పాతబస్తీలో బండి సంజయ్ బైక్ ర్యాలీ.. శుక్రవారం కావడంతో పోలీసుల్లో టెన్షన్..అరెస్టుకు రంగం సిద్ధం

Bandi Sanjay Bike Rally in old city : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. పార్టీ ఆఫీస్ నుంచి చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం వరకు బండి సంజయ్ బైక్ ర్యాలీకి పిలుపునివ్వడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఎన్నికల కోడ్ ఉండటంతో ర్యాలీకి అనుమతి లేదని ఇప్పటికే పోలీసులు తేల్చి చెప్పారు. ర్యాలీ నిర్వహించకుండా ముందస్తుగా అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నారు. సంజయ్ ఇంటి ముందు, పార్టీ ఆఫీస్ ముందు భారీగా పోలీసులు మోహరించారు.



అయితే పార్టీ ఆఫీస్ లోనూ, ఇంటి వద్ద సంజయ్ లేకపోవడంతో ఆయన ఆచూకీ కోసం నిఘా వర్గాలు గాలిస్తున్నాయి. పైగా నేడు శుక్రవారం కావడం, ముస్లింలు నమాజ్‌కు వచ్చే టైం కావడంతో.. ర్యాలీ సమయంలో ఎలాంటి గందరగోళం ఏర్పడుతుందో అని పోలీసులు టెన్షన్ పడుతున్నారు. ముందస్తుగా బీజేపీ పార్టీ ఆఫీస్ నుంచి భాగ్యలక్ష్మీ టెంపుల్‌కు వెళ్లే ఏరియాల్లో భారీగా పోలీసులు మోహరించారు.



https://10tv.in/leaders-joining-in-to-bjp-from-other-parties/
మధ్యాహ్నం 12 గంటల వరకు ఎలాగైనా భాగ్యలక్ష్మీ ఆలయానికి చేరుకుంటానని బండి సంజయ్ పార్టీ కార్యకర్తలకు, నేతలు స్పష్టం చేశారు. పోలీసులకు దొరకకుండా ఆలయానికి చేరుకోవాలని భావిస్తున్నారు. కాగా హైదరాబాద్‌లో వరద సాయం ఇవ్వొద్దని ఈసీకి బండి సంజయ్ లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే లేఖను తాను రాయలేదని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫేక్ లెటర్లు సృష్టించారని ఇప్పటికే ఆయన ఆరోపించారు.



ప్రజలకు నిజానిజాలు తెలిపేందుకు భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రమాణం చేసేందుకు రావాలని సవాల్ కూడా విసిరారు. లేకపోతే తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖపై సీసీఎస్ పోలీసులకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ లేఖ తమ పార్టీ ప్రెసిడెంట్ రాయలేదని, ఇదో ఫేక్ లెటర్ అని కంప్లైట్ చేశారు.