Bandi Sanjay : కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలి : బండి సంజయ్

రైతులకు రుణమాఫీ చేయలేదని విమర్శించారు. 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు.

Bandi Sanjay : కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలి : బండి సంజయ్

Bandi Sanjay (6)

Bandi Sanjay Criticized KCR : బీజేపీ అంటే ఏంటో ఖమ్మంలో చూపిస్తామని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వాడు…వీడు మొరిగితే పట్టించుకోబోమని తెలిపారు. మర్డర్ కేసు నుండి తప్పించుకోవడం కోసం ఒకరు, ఎంఎల్ఏ కోసం మరొకరు పోర్లు దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. సాయి గణేష్ మరణం వృధా కానివ్వమని, ఖమ్మంలో కాషాయ జెండా ఎగురుతుందన్నారు. ఒకడు టీఆర్ఎస్ అంటే, మరొకడు బీఆర్ఎస్ అంటారు… వాళ్ళ పార్టీ ఏదో వారికే అర్థం కావటం లేదని ఎద్దేవా చేశారు.

బీజేపీకి 7% నుండి 30 శాతం ఓటింగ్ పెరిగిందని తెలిపారు. కాంగ్రెస్ కి ఓటింగ్ శాతం తగ్గిందని.. దుబ్బాకలో డిపాజిట్ రాలేదని చెప్పారు. భాగ్యనగరంలో 4 నుండి 48 కార్పొరేటర్లు గెలిచామని తెలిపారు. ఖమ్మంలో బీజేపీ చేపట్టిన నిరుద్యోగ మార్చ్ ప్రోగ్రాంలో బండి సంజయ్ పాల్గొని, మాట్లాడారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ కు డిపాజిట్ రాలేదని పేర్కొన్నారు.

BJP Unemployment March : ఖమ్మంలో బీజేపీ నిరుద్యోగ మార్చ్.. ఫ్లెక్సీలో కనిపించని ఈటల రాజేందర్ ఫొటో

గెలిచేది బీజేపీ.. వచ్చేది బీజేపీ… ఖమ్మంలో రామరాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పంజాబ్, ఢిల్లీ నుండి దోస్తులు వచ్చారని.. లిక్కర్ స్కాంలో వచ్చిన పైసలు పంచుకోవడానికి వచ్చారని విమర్శించారు. పోలీసులకు జీతాలు రావటం లేదన్నారు. ఖమ్మంలో టీఆర్ ఎస్ ఎంఎల్ఏలు, మంత్రులు కాకముందు మీ చరిత్ర ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ వాళ్ళు గుండాయిజం చేయడం మొదలు పెడితే మీ పరిస్థితి ఏమిటని నిలదీశారు.

కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్ లో చేరారని.. మిగిలిన వాళ్ళు అటా.. ఇటా అన్న డైలామాలో ఉన్నారని తెలిపారు. గోదావరి జలాలు వచ్చాయి… కాళ్ళు కడిగారా అని అడిగారు. పెట్రోల్ పోసుకున్న హరీష్ రావుకి అగ్గి పెట్ట దొరకలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ని హిందూ అని చెప్పించిన ఘనత బీజేపీదేనని అన్నారు. భద్రాచలం వరద సమయంలో కేసీఆర్ వెయ్యి కోట్లు ఇచ్చాడా.. దేని కోసం బీఆర్ఎస్ కు ఓట్లు వేయాలని ప్రశ్నించారు.

Nandamuri Lakshmi Parvati : ఎన్టీఆర్ చనిపోయే ముందు చంద్రబాబు వల్ల తీవ్ర ఆందోళనకు గురయ్యారు : నందమూరి లక్ష్మి పార్వతి

30లక్షల మంది నిరుద్యోగ మార్చ్ చేస్తుంటే …కాంగ్రెస్, బీఆర్ ఎస్ తప్పు దోవ పట్టిస్తున్నాయని తెలిపారు. టీఎస్పీఎస్సీ ఘటనలో సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ ట్విట్టర్ టిల్లును మెడ పట్టి బయటకు పంపిస్తామని అన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ కార్డు ప్రకటిస్తాం, యువతకు జంబో ఉపాధ్యాయ పోస్ట్ లు నింపుతామన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు.

‘మీ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి’ అని కేసీఆర్ ను ఉద్ధేశించి మాట్లాడారు. 34 నోటిఫికేషన్లు ఇస్తే ఒక్కరికీ ఉద్యోగం రాలేదన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో ఇద్దరే తప్పు చేశారు అన్నారు… కానీ, ఇప్పటికీ 58 వచ్చారు… సిట్టింగ్ జడ్జీతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పదో తరగతి పేపర్ లీక్ అని అరెస్టు చేశారు.. జైలు కు పోయానని చెప్పారు. బండి సంజయ్ మోదీ శిష్యుడు, అమిత్ షా వారసుడని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఉంటే జీతాలు రావు అన్నారు.

NITI Aayog Meeting: నీతి అయోగ్ సమావేశానికి డుమ్మా కొట్టిన ముఖ్యమంత్రులకు బాధ్యత లేదట.. మాజీ మంత్రి రవిశంకర్ ఫైర్

రైతులకు రుణమాఫీ చేయలేదని విమర్శించారు. 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు ఆందోళన చేసిన తల్లిదండ్రులను కుక్కను కొట్టిన్నట్లు కొట్టారని పేర్కొన్నారు. సింగరేణిని అదో గతిపాలు చేశారని తెలిపారు. పంచాయతీలకి పైసలు ఇస్తానని ఇవ్వలేదని సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ లు కాళోజీని గుర్తుంచుకోవాలన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఏమైయ్యాయని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని చెప్పారు. ఫసలీ భీమా యోజన పథకాన్ని రైతులకు వర్తింప చేస్తామని చెప్పారు. కొలువులు కావాలంటే బీజేపీ రావాలన్నారు.