Bandi Sanjay : తెలంగాణలో శ్రీలంక, పాకిస్థాన్ పరిస్థితి వస్తుంది : బండి సంజయ్

అధిక ద్రవ్యోల్బణం తగ్గించేందుకు జీవన వ్యయాన్ని పెంచండి అని సూచించారు. అధిక ద్రవ్యోల్బణం పెట్టుబడులను ఆకర్షించడంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్ర పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు.

Bandi Sanjay : తెలంగాణలో శ్రీలంక, పాకిస్థాన్ పరిస్థితి వస్తుంది : బండి సంజయ్

Bandi Sanjay

Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణలో ద్రవ్యోల్బణంపై సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక, పాకిస్థాన్ పరిస్థితి వస్తుందంటూ ట్విట్ చేశారు. ఈ పరిస్థితికి 100% బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని తెలిపారు.

పాకిస్థాన్ లేదా శ్రీలంక లాగా టీఎస్ ఆర్థిక పతనం దిశగా పయనిస్తోందా? అని అన్నారు. 7.63% వద్ద, తెలంగాణలో ద్రవ్యోల్బణం జాతీయ సగటు కంటే దాదాపు 200 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణ ద్రవ్యోల్బణంపై కేంద్రాన్ని నిందించడం పనికిరాదని చెప్పారు.

TSPSC Paper Leak : TSPSC ప్రశ్నాపత్రాలు, గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీక్ .. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఘాటు విమర్శలు

అధిక ద్రవ్యోల్బణం తగ్గించేందుకు జీవన వ్యయాన్ని పెంచండి అని సూచించారు. అధిక ద్రవ్యోల్బణం పెట్టుబడులను ఆకర్షించడంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్ర పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు. ఇంధనంపై వ్యాట్ తగ్గించి రాష్ట్రంలో ద్రవ్యోల్బణ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.