Bandi Sanjay: అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం: బండి సంజయ్

Bandi Sanjay: తెలంగాణలో నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బండి సంజయ్ అన్నారు.

Bandi Sanjay: అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం: బండి సంజయ్

Bandi Sanjay

Bandi Sanjay: అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Union Public Service Commission) తరహాలోనే తమ ప్రభుత్వం తెలంగాణలో ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుందని అన్నారు.

ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పరీక్షల్లో ఎలాంటి లీకేజీలు లేకుండా చూస్తామని బండి సంజయ్ భరోసా ఇచ్చారు. మే 11న సంగారెడ్డిలో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణలో నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

తాము నిరుద్యోగుల పక్షాన పోరాడుతూనే ఉంటామని బండి సంజయ్ చెప్పారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వల్ల పలు పరీక్షలను రద్దు చేశారని, దీంతో చాలా మంది యువత నష్టపోయారని అన్నారు.

వారందరికీ రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని బండి సంజయ్ చెప్పారు. బీజేపీ నిరుద్యోగ మార్చ్ లు ప్రస్తుతం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తోందని, జూన్ లో హైదరాబాద్ లో నిర్వహిస్తామని తెలిపారు. కాగా, ఇప్పటికే పలు జిల్లాల కేంద్రాల్లో బీజేపీ నిరుద్యోగ మార్చ్ నిర్వహించింది.

Mayawati: బీఎస్పీ తెలంగాణ సీఎం అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ పేరును ప్రకటించిన మాయావతి.. కేసీఆర్ గురించి ఏమన్నారంటే?