Karimnagar : కేసీఆర్ నెక్ట్స్ టార్గెట్ హరీష్‌రావే: బండి సంజయ్

CM కేసీఆర్ నెక్ట్స్ టార్గెట్ హరీష్‌రావే అంటూ బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈటెలను బయటకు ఎలా పంపించారో హరీశ్ రావుని కూడా అలాగే పంపిస్తారని అన్నారు.

10TV Telugu News

KCR Next Target  Harish Rao  : హుజూరాబాద్ ఉప ఎన్నిక రాజకీయ పార్టీల మధ్య కాకరాజేస్తోంది. అటు టీఆర్ఎస్ ఇటు బీజేపీ హుజూరోజు రోజుకు మాటల యుద్ధం పెరుగుతోంది. నువ్వా నేనా అన్నట్లుగా ఇరు పార్టీల నేతలు మాటల యుద్ధంలో తగ్గేదేలే అంటున్నాయి. ఈక్రమంలో బీజేపీ నేత.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంత్రి హరీశ్ రావును ఉద్ధేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.  సీఎం కేసీ నెక్ట్స్ టార్గెట్ హరీష్ రావేనని..హరీశ్ రావు మంచోడు కానీ పార్టీ కోసం అబద్దాలు ఆడుతున్నారు. టీఆర్ఎస్ నెస్ట్ టార్గెట్ హరీష్ రావేనని..ఈటెల రాజేందర్ ను పార్టీ నుంచి కేసీఆర్ ఎలా బయటకు పంపించాడో…హరీష్ రావును అలానే బయటకు పంపిస్తారని వ్యాఖ్యానించారు.

Read more : Yadadri Temple: యాదాద్రి టెంపుల్ కోసం ఆర్బీఐ నుంచి 125కేజీల బంగారం

అందుకే టీఆర్ఎస్ అధినేత గెలుపొందుతాం అనే చోట కేసీఆర్ వెళతారు. ఓడిపోతాం అనే చోటికి హరీష్ రావుని పంపుతారని అన్నారు. అటువంటి పనుల్లో భాగంగానే హరీశ్ రావును త్వరలో పార్టీ నుంచి బయటకు పంపేస్తారని అన్నారు. హరీష్ రావు పై మాకు కోపం లేదు. కానీ హరిశ్ అన్నా..పార్టీ కోసం అబద్ధాలు ఆడకు…నిజాలు మాట్లాడు..వాస్తవాలు దాచిపెట్టి అబద్దాలు ఆడుతు ప్రజలను తప్పు దారి పట్టించకు అంటూ హరీశ్ రావుకు బండి సంజయ్ సూచించారు.ఇంకా బండి సంజయ్ మాట్లాడుతు..‘‘హరీశ్ రావు కేసీఆర్ టార్గెట్ నీమీదే పెట్టారు. గమనించుకో..నువ్వు మంచోడివే..కానీ అబద్దాలు మాట్లాడకు.. కేసీఆర్ కుటుంబంలో నాలుగైదు కమిటీలు ఉన్నాయి. ఒకటి లంచం ఎలా తీసుకోవాలో ప్లాన్ చేసే కమిటీ.. మరొకటి మీడియా ముందు అబద్దాలు మాట్లాడే కమిటి అని ఎద్దేవా చేశారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హుజురాబాద్‌లో గెలవాలని అనుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు.

Read more : CM KCR : నవంబర్ 4 నుంచి యథావిధిగా దళితబంధు : సీఎం కేసీఆర్

కాగా.. ‘దళితబంధు’ పథకం పేరుతో దళితులను సీఎం కేసీఆర్ మరోసారి మోసం చేసారని..దానికి కేసీఆర్‌ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బండి సంజయ్ డిమాండ్‌ చేశారు. ఇప్పటిదాకా ఒక్క దళిత లబ్ధిదారుకు కూడా ఆ నిధులను వాడుకునే అవకాశం లేకుండా చేసి..తాజాగా మరో రూ.250 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించి మరో డ్రామాకు తెరలేపారని సంజయ్‌ విమర్శించారు. దళితబంధు డబ్బులను లబ్ధిదారుల అకౌంట్లో వేస్తున్నా, వాటిని డ్రా చేసుకోకుండా ఫ్రీజింగ్‌ చేశారని మండిపడ్డారు.

ఈ పథకాన్ని ప్రకటించినప్పుడు బేషరతుగా దళితులు ఆ నిధులను వాడుకుని ఉపాధి పొందవచ్చని చెప్పిన కేసీఆర్‌ ఆ తరువాత మాటమార్చి షరతులు విధించారని..దళితులను కేసీఆర్‌ మొదటి నుంచి మోసం చేస్తూనే ఉన్నారని, దళితుడిని సీఎం చేస్తానని, వారికి మూడెకరాల చొప్పున భూమి ఇస్తానని ఇచ్చిన హామీలను గాలికొదిలేసారని బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు.