Crocodiles: బాబోయ్.. వరి పొలంలో భారీ మొసలి.. రైతులు ఏం చేశారంటే..

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ వద్ద  పంట పొలాల్లోకి ఓ భారీ మొసలి వచ్చింది. రైతు సాగుచేసిన వరి పొలంలో అటూఇటూ తిరుగుతోంది. అదే సమయంలో పొలంలోకి రైతు వెళ్లారు. గట్టుపై నుండి పొలాన్ని చూస్తూ నడుస్తున్న రైతుకు మొసలి కనిపించింది.

Crocodiles: బాబోయ్.. వరి పొలంలో భారీ మొసలి.. రైతులు ఏం చేశారంటే..

Crocodile

Crocodiles: నదులు, చెరువుల్లో మనం మొసలిని చూస్తుంటాం. కానీ అది పొలంలో మన కళ్లముందుకొచ్చి ఆగితే ఎలా ఉంటుంది..? ఒంటికి చమటలు పట్టడం ఖాయం. అదే పరిస్థితి ఓ రైతుకు ఎదురైంది. ఏదో దేశం, రాష్ట్రంలో కాదు.. మన తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లాలోనే. అయితే, మొసలిని చూసిన రైతు దానిని బంధించేందుకు స్థానిక రైతులకు సమాచారం ఇచ్చారు. అయినా సాధ్యంకాకపోవటంతో ఓ పొక్లెయిన్ ను తెప్పించి దాని సాయంతో మొసలిని బయటకు తీశారు.

viral video : ఏయ్ బుజ్జీ..డాడీ వచ్చేస్తున్నారు,టీవీ కట్టేసి చదువుకో : పాపకు వార్నింగ్ ఇచ్చిన కుక్క

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ వద్ద  పంట పొలాల్లోకి ఓ భారీ మొసలి వచ్చింది. రైతు సాగుచేసిన వరి పొలంలో అటూఇటూ తిరుగుతోంది. అదే సమయంలో పొలంలోకి రైతు వెళ్లారు. గట్టుపై నుండి పొలాన్ని చూస్తూ నడుస్తున్న రైతుకు మొసలి కనిపించింది. రైతు అలికిడి విన్న మొసలి పక్కనే ఉన్న మరో రైతు పొలంలోని గుంతలోకి జారుకుంది. విషయాన్ని రైతు గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న గ్రామస్తులు మొసలిని బంధించేందుకు ప్రయత్నించారు. దీంతో వనపర్తిలోని సాగర్ స్నేక్ సొసైటీ నిర్వాహకుడు, హోంగార్డు కృష్ణాసాగర్ కు సమాచారం ఇచ్చారు. ఎంత ప్రయత్నించినప్పటికీ మొసలిని బంధించడం అతనికి సాధ్యం కాలేదు.

Crocodiles: వామ్మో.. ఇళ్లలోకి వచ్చిన 250కిపైగా మొసళ్లు.. భయంతో వణికిపోయిన ప్రజలు.. ఎక్కడంటే?

విషయాన్ని రైతులు స్థానిక పోలీసులకు తెలియజేశారు. ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పంటపొలం వద్దకు చేరుకున్నారు. ఓ పొక్లెయిన్ ను తెప్పించి దానిసాయంతో మొసలిని బయటకు తీశారు. అటవీశాఖ అధికారుల ఆదేశాల మేరకు మొసలిని జూరాల ప్రాజెక్టు నీటిలో వదిలేశారు. అయితే, వెల్టూర్ గ్రామం సమీపంలో చెరువు కింద రైతు వరి పంటను సాగు చేయగా, ఆ చెరువులో నుంచి మొసలి పొలంలోకి వచ్చినట్లు రైతులు తెలిపారు. మొసలి పొలంలోకి రావడంతో స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.