Munugode Bypoll: తమ అభ్యర్థిని ప్రకటించిన బీఎస్‭పీ చీఫ్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అయితే రిటైర్డ్ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ చేరికతో ఈ మధ్య బహుజన్ సమాజ్ పార్టీ కొంత మేరకు వినిపిస్తోంది. రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం ప్రవీణ్ కుమార్ ఎదుర్కోబోయే తొలి ఎన్నిక ఇదే. ఇక టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి

Munugode Bypoll: తమ అభ్యర్థిని ప్రకటించిన బీఎస్‭పీ చీఫ్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

BSP announced their candidate for munugode bypoll

Updated On : October 8, 2022 / 3:40 PM IST

Munugode Bypoll: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి తమ అభ్యర్థిని ప్రకటించింది బహుజన్ సమాజ్ పార్టీ. కొద్ది రోజులుగా నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్న ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్.. శుక్రవారం నియోజకర్గంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థిని ప్రకటించారు. ముందుగా చెప్పినట్లే ఓబీసీ వర్గానికి చెందిన అభ్యర్థిని బీఎస్పీ నుంచి పోటీ దారుగా ఎంచుకున్నారు. నియోజకవర్గంలోని నారాయణపూర్ మండలం జనగాం గ్రామానికి చెందిన అందోజు శ్రీకాంతచారిని అభ్యర్థిగా ప్రకటించారు.

కాగా, మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అయితే రిటైర్డ్ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ చేరికతో ఈ మధ్య బహుజన్ సమాజ్ పార్టీ కొంత మేరకు వినిపిస్తోంది. రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం ప్రవీణ్ కుమార్ ఎదుర్కోబోయే తొలి ఎన్నిక ఇదే. ఇక టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. రాజీనామా చేసి ఉప ఎన్నికకు తెరలేపిన రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఫైనల్ చేశారు. వీరందరి కంటే ముందే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. ఆ పార్టీ నుంచి పాల్వాయి స్రవంతిని బరిలోకి దింపారు.

Minister Jagadish Reddy: రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయాడు