Road Accident: వనపర్తి జిల్లాలో ట్రాక్టర్‌ను ఢీకొన్న బస్సు.. ముగ్గురు మృతి

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెరుకు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను గరుడ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా, 16 మందికి గాయాలయ్యాయి.

Road Accident: వనపర్తి జిల్లాలో ట్రాక్టర్‌ను ఢీకొన్న బస్సు.. ముగ్గురు మృతి

Road Accident In Wanaparthi

Updated On : November 21, 2022 / 8:28 AM IST

Road Accident: వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తకోట మండలంలోని జాతీయ రహదారిపై ముమ్మాళ్లపల్లి వద్ద ఆదివారం రాత్రి చెరుకు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను గరుడ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా, 16 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటీన స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే వీరిలో కొందరికి తీవ్రగాయాలయ్యాయి.

Pune Road Accident: పుణె-బెంగళూరు హైవేపై లారీ బీభత్సం.. 48వాహనాలు ధ్వంసం.. 30మందికి గాయాలు

చెరుకులోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన మియాపూర్ డిపో గరుడ బస్సు ఢీకొట్టింది. బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. మృతుల్లో డ్రైవర్, క్లీనర్ తో పాటు ఓ ప్రయాణికుడు ఉన్నారు.

Bihar Road Accident : బీహార్‌లో ఘోర ప్రమాదం.. జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఆరుగురు చిన్నారులతో సహా 8మంది మృతి

ప్రమాద విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్సుల సహాయంతో వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంతో రహదారిపై సుమారు నాలుగు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తప్పించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.