Car Crash: కరీంనగర్‌లో వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిన్న ముల్కనూరులో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో ఓ కారు పడిన ఘటన చోటుచేసుకుంది. కారులోని ఈ ప్రమాదంలో గల్లంతవగా.. కరీంనగర్ నుండి హుస్నాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

10TV Telugu News

Car Crashed into Well: ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిన్న ముల్కనూరులో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో ఓ కారు పడిన ఘటన చోటుచేసుకుంది. కారులోని ఈ ప్రమాదంలో గల్లంతవగా.. కరీంనగర్ నుండి హుస్నాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ముల్కనూరులో కారు కోసం గాలింపు కొనసాగుతోంది. ఉదయం 10గంటల సమయంలో వేగంగా వచ్చిన కారు గ్రామశివారులోని వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది.

సమాచారం అందుకున్న పోలీసులు 4గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. క్రేన్, గజ ఈతగాళ్ల సాయంతో కారును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతుండగా.. ఘటన స్థలంలో సహాయక చర్యలు సాగుతున్నాయి.

గజ ఈతగాళ్లు, రెస్క్యూ సిబ్బందితో బావిలో పడిన కారును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. కారు అతివేగంగా నడపడం వల్లే అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయిందని ప్రత్యక్షసాక్షి చెప్పారు. ఐదు నిమిషాలల్లోనే కారు బావిలో పూర్తిగా మునిగిపోయింది.

సంఘటనా స్థలానికి చేరుకున్న హుస్నాబాద్ ఎస్సై చల్లా మధూకర్ రెడ్డి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వ్యవసాయ బావిలో పడిన కారును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బావిలో నీరు ఎక్కువగా ఉండటంతో కారును బయటకు తీసేందుకు కష్టంగా ఉందని ఈతగాళ్లు చెబుతున్నారు.

10TV Telugu News