Diginal India Scam : వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఘరానా మోసం.. రూ.30కోట్లతో జంప్

తమ కంపెనీలో చేరే వారి దగ్గర లక్ష రూపాయల నుంచి 5లక్షల వరకు డిజినల్ ఇండియా వసూలు చేసింది. అలా దాదాపు 700మంది బాధితుల నుంచి రూ.30కోట్లకు పైగా కలెక్ట్ చేసి జంప్ అయ్యారు.

Diginal India Scam : వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఘరానా మోసం.. రూ.30కోట్లతో జంప్

Diginal India Scam

Diginal India Scam : వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో నిరుద్యోగులను నిండా ముంచిన డిజినల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్కామ్ లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్ సూత్రధారులుగా అమిత్ శర్మ, విజయ్ ఠాకూర్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. కీలక నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

అంతర్జాతీయ పుస్తకాలు, నవలలు డిజిటల్ చేస్తున్నామని, తమ కంపెనీలో చేరే వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పిస్తామంటూ దేశవ్యాప్తంగా డిజినల్ ఇండియా ప్రచారం చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ కేంద్రంగా వ్యవహారం నడిపింది. హార్డ్ కాపీస్ ను సాఫ్ట్ కాపీస్ గా మార్చడమే పని అని చెప్పిన డిజినల్ ఇండియా ప్రతినిధులు ఒక్కో పేజ్ స్కానింగ్ కు నిరుద్యోగులకు 5రూపాయలు ఆఫర్ చేశారు. పది వేలు అంతకంటే ఎక్కువ పేజీలు స్కాన్ చేయాలంటే అందుకు డిపాజిట్ కట్టాలంటూ కండీషన్లు పెట్టారు.

Rats stole Gold: బంగారాన్ని ఎత్తుకెళ్లిన ఎలుకలు.. ఎలా గుర్తించారంటే..

మొదట కొన్ని నెలలు పేమెంట్స్ టైమ్ టు టైమ్ చెల్లించి అందరినీ నమ్మించింది. నెలకు రూ.3లక్షలకు పైనే జీతం అంటూ నిరుద్యోగులకు వల వేశారు. ఐదున్నర లక్షలు డిపాజిట్ చేస్తే ఆరు నెలల్లో తిరిగిస్తామంటూ ప్రకటనలు గుప్పించారు. నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు డిపాజిట్ చేయించుకున్నారు.

తమకు సమయానికి పెద్ద మొత్తంలో డబ్బు వస్తుండటంతో డిజినల్ కంపెనీలో చేరినవారు ఫ్రీ మౌత్ పబ్లిసిటీ చేశారు. తమ కుటుంబసభ్యులు, బంధువులు, తెలిసిన వారిని కంపెనీలో చేర్చారు. అలా తమ కంపెనీలో చేరే వారి దగ్గర లక్ష రూపాయల నుంచి 5లక్షల వరకు డిజినల్ ఇండియా వసూలు చేసింది. అలా దాదాపు 700మంది బాధితుల నుంచి రూ.30కోట్లకు పైగా వసూలు చేసింది.

Call Girl Scam : మీ ఫోన్లకు ఇలా మెసేజ్‌లు వస్తున్నాయా? కాల్ గ్లర్స్ కావొచ్చు.. జాగ్రత్త..!

ఇక డిజినల్ ఇండియా లావాదేవీలను నమ్మి ఆ సంస్థలో పని చేసిన వారు కూడా లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. చివరికి కంపెనీ జెండా ఎత్తేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. న్యాయం చేయాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.