Car Accident: కారు బోల్తా ఘటనలో బిగ్ ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తి ఎవరంటే?

కరీంనగర్‌లో కారు బావిలో పడిన ఘటనలో హృదయం ద్రవించే విషయం వెలుగులోకి వచ్చింది.

Car Accident: కారు బోల్తా ఘటనలో బిగ్ ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తి ఎవరంటే?

Car

Car Accident: కరీంనగర్‌లో కారు బావిలో పడిన ఘటనలో హృదయం ద్రవించే విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాద ఘటనలో చనిపోయిన వ్యక్తి అక్కడే డ్యూటీలో ఉన్న ఫైర్ ఆఫీసర్‌ బూదయ్యకి సొంత అన్నే. మృతదేహాన్ని వెలికితీయగానే అన్నను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు బూదయ్య.

ఈ హృదయవిదారక ఘటన అక్కడి వారిని కలిచి వేసింది. ఉదయం నుంచి కారుతో సహా భావిలో పడిన వ్యక్తిని వెలికి తీసేందుకు తీవ్రంగా కష్టపడ్డారు బూదయ్య. గత ఈతగాళ్లతో కలిసి శ్రమించాడు.

తొమ్మిది గంటల పాటు గాలించిన తర్వాత కారును వెలికి తీయగా.. తీరా శవాన్ని బయటకు తీశాక చనిపోయిన వ్యక్తి తన సొంత అన్నేనని తెలియడంతో ఫైర్ ఆఫీసర్ కన్నీంటి పర్యంతమయ్యాడు. సొంత అన్న మృతదేహాన్ని చూసి విలవిలలాడిపోయాడు.

ఎవరో తెలియని వ్యక్తి కోసం గాలింపు చేపట్టిన ఫైర్‌ ఆఫీసర్ బూదయ్య వారి కుటుంబ సభ్యులకు వివరాల తెలియజేయాలని ఆధారాల కోసం చూశాడు. కానీ కారులో దొరికిన ఆధారాలతోపాటు మృతదేహాన్ని చూసిన వెంటనే అది తన సొంత అన్నదేనని తెలిసి బోరున విలపించాడు బూదయ్య.

బావిలో నుంచి కారును తీసేందుకు 9 గంటలుగా చర్యలు సాగించారు అధికారులు. ఉదయం 11 గంటలకు ఓవర్‌ స్పీడ్‌తో దూసుకొచ్చి రాంగ్‌రూట్‌లో వెళ్లి వ్యవసాయ బావిలో పడింది కారు. బావిలో నీరు ఎక్కువగా ఉండటంతో అధికారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

గజ ఈతగాళ్లు భారీ వంకెల సాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. 3 మోటార్ల సాయంతో నీటిని తోడి చివరకు మృతదేహాలను, కారును తీయడంలో సక్సెస్ అయ్యారు అధికారులు.

మృతుడు రిటైర్డ్ ఎస్‌ఐ పాపయ్య నాయక్‌గా గుర్తించారు. మృతుడు భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ వాసిగా గుర్తించారు.