Ikkat Shaluvas : హస్తినలో సీఎం కేసీఆర్, కేంద్రమంత్రులకు ‘ఇక్కత్ వస్త్రాల’తో సన్మానం

తెలంగాణ ఇక్కత్‌  వస్త్రాలను ఢిల్లీకి పరిచయం చేశారు సీఎం కేసీఆర్. హస్తిన పర్యటనలో ఉన్న కేసీఆర్ .. ప్రధాని సహా కేంద్ర మంత్రులను కలిశారు.

Ikkat Shaluvas : హస్తినలో సీఎం కేసీఆర్, కేంద్రమంత్రులకు ‘ఇక్కత్ వస్త్రాల’తో సన్మానం

Modi

CM KCR Delhi Tour : తెలంగాణ ఇక్కత్‌  వస్త్రాలను ఢిల్లీకి పరిచయం చేశారు సీఎం కేసీఆర్. హస్తిన పర్యటనలో ఉన్న కేసీఆర్ .. ప్రధాని సహా కేంద్ర మంత్రులను కలిశారు. ఈ సందర్భంగా వారికి పోచంపల్లిలో నేసిన ఇక్కత్‌ పట్టుశాలువాలను కప్పారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోమంత్రి అమిత్‌ షా, కేంద్ర ఉపరితల రవాణాశాఖమంత్రి గడ్కరీ, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్‌ను ఇక్కత్‌ పట్టు శాలువాలతో సత్కరించారు.

Read More : Telangana : జోరు వానలు, ప్రాజెక్టులు ఫుల్

వారికి పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల గురించి వివరించారు.నల్లగొండ జిల్లాలోని పోచంపల్లి ఇక్కత్‌కు తెలంగాణ ప్రభుత్వం చేయూతనిచ్చి పూర్వ వైభవం కల్పించింది. సాంప్రదాయ వారసత్వ ప్రతీకైన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు అత్యద్భుతం. భూదాన్ పోచంపల్లిలో చేనేత కార్మికులు మగ్గాల మీద వస్త్రాలను నేస్తారు. చీరలు, డ్రెస్ మెటిరీయల్స్, బెడ్‌ షీట్స్, లుంగీలు, గృహపయోగ వస్త్రాలు, ఇలా అనేక రకాల వస్త్రాలకు ఇక్కత్‌ ఫేమస్‌. బోలెడన్నీ వెరైటీలతో దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అంతర్జాతీయంగా ఖ్యాతి గడించడంతో…ఇక్కత్ చీరలకు మంచి గిరాకీ ఉంది. చేనేతకు చేయూతనిచ్చిన సీఎం కేసీఆర్ ఆ వస్త్రాలకు మరింత ప్రాచుర్యం కల్పిస్తున్నారు. ప్రభుత్వ సన్మాన కార్యక్రమాల్లో కూడా ఇక్కత్ శాలువాలనే వినియోగిస్తున్నారు సీఎం కేసీఆర్.

Read More : Telangana Rains: దంచికొడుతున్న వానలు.. మబ్బులకు రంధ్రం పడిందా?

ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్…పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. అందులో భాగంగా… కృష్ణా, గోదావరి నదీ జలాల అంశంపై కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌ను కలిశారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన నీటి వాటా గురించి ఆధారాలతో షెకావత్‌కు వివరించారు. గంటా.. 40 నిమిషాల పాటు సమావేశం జరిగింది. ఎనిమిది నెలల విరామం తర్వాత షెకావత్‌ను కలిసిన సీఎం కేసీఆర్.. ఒక్కో ప్రాజెక్టుకు ఉన్న ప్రాధాన్యతలను వివరించి చెప్పారు. సీఎం చెప్పిన విషయాలను ఆసక్తిగా విన్నారు షెకావత్‌. ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ నీటిపారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌.. మూడు రోజుల క్రితం జరిగిన కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ సమావేశాలకు హాజరైనట్లు కేంద్రమంత్రి షెకావత్‌కు తెలిపారు.